ఉత్తరాదిని వణికిస్తున్న హిమపాతం…

సిమ్లా: ఉత్తరాది రాష్ట్రాలను హిమపాతం వణికిస్తోంది. గత కొన్నిరోజులుగా మంచు కురుస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. పర్యటక నగరాలైన సిమ్లా, నార్కందా, కుర్ఫీ, దాల్‌హౌజీ, ధర్మశాల, పాలమ్‌పూర్‌, మనాలీ నగరాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని.. కల్ప, చిట్‌కుల్‌, కిన్నౌర్‌, కీలాంగ్‌ నగరాల్లో భారీగా హిమపాతం ఉండొచ్చని పేర్కొంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కీలాంగ్‌ నగరం అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ -1.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. కల్ప, […]


సిమ్లా: ఉత్తరాది రాష్ట్రాలను హిమపాతం వణికిస్తోంది. గత కొన్నిరోజులుగా మంచు కురుస్తూనే ఉంది. జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. పర్యటక నగరాలైన సిమ్లా, నార్కందా, కుర్ఫీ, దాల్‌హౌజీ, ధర్మశాల, పాలమ్‌పూర్‌, మనాలీ నగరాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని.. కల్ప, చిట్‌కుల్‌, కిన్నౌర్‌, కీలాంగ్‌ నగరాల్లో భారీగా హిమపాతం ఉండొచ్చని పేర్కొంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కీలాంగ్‌ నగరం అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ -1.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. కల్ప, మనాలీల్లో ఒకటి నుంచి 1.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.సిమ్లాలో రికార్డు స్థాయిలో 9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందనట్లు వాతావరణ శాఖ తెలిపింది. విపరీతమైన మంచు కురుస్తుండటంతో జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని  హోంమత్రిత్వశాఖ హెచ్చరించింది. హిమపాతం అధికమైతే తక్షణం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోంమత్రిత్వశాఖ రాష్ట్రాల అధికారులకు సూచించింది.

Hevy Snowfall in Shimla

Telangana News