అఫ్గాన్‌లో తాలిబన్ల ఘాతుకం…

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో పశ్చిమ ఫరా ప్రావిన్స్‌లోని ఓ పోలీస్‌ పోస్టుపై తాలిబన్‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 35మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రావిన్స్‌ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో జిల్లా పోలీస్‌ కమాండర్‌ అబ్దుల్‌ జబార్‌ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు ఉగ్రవాదులు ఖాకి సఫేద్‌ జిల్లాలోని పోలీస్‌ పోస్టులోకి చొరబడి అక్కడి భద్రతాసిబ్బందిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ముష్కరులను అడ్డుకునేందుకు భద్రతాసిబ్బంది కూడా ఎదురుకాల్పులు దిగారు. దాదాపు 4 గంటల […]

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో పశ్చిమ ఫరా ప్రావిన్స్‌లోని ఓ పోలీస్‌ పోస్టుపై తాలిబన్‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 35మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రావిన్స్‌ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో జిల్లా పోలీస్‌ కమాండర్‌ అబ్దుల్‌ జబార్‌ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.

బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు ఉగ్రవాదులు ఖాకి సఫేద్‌ జిల్లాలోని పోలీస్‌ పోస్టులోకి చొరబడి అక్కడి భద్రతాసిబ్బందిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ముష్కరులను అడ్డుకునేందుకు భద్రతాసిబ్బంది కూడా ఎదురుకాల్పులు దిగారు. దాదాపు 4 గంటల పాటు ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లో 17మంది తాలిబన్ ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టిన్నట్లు సమాచారం.

Taliban terrorists Attack on police post in Afghanistan

Related Stories: