దమ్ముంటే ఆ ఎంపిలేవరో చెప్పు రేవంత్…

హైదరాబాద్ : రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి మారుతున్న ఆ ఇద్దరు ఎంపిలేవరో చెప్పాలని టిఆర్‌ఎస్ ఎంపి సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సీతారాం నాయక్ చెప్పారు. సీతారాం నాయక్ టిఆర్ఎస్ పార్టీ మారుతున్నారనే పుకార్లపై ఆయన స్పందించారు. దీంతో గురువారం తెలంగాణ భవన్‌లో సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరు టిఆర్‌ఎస్ ఎంపిలు పార్టీ మారుతున్నారని రేవంత్ చెప్పడం.. ఆ వార్త కాస్త పేపర్లలో రావడం.. […]

హైదరాబాద్ : రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి మారుతున్న ఆ ఇద్దరు ఎంపిలేవరో చెప్పాలని టిఆర్‌ఎస్ ఎంపి సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సీతారాం నాయక్ చెప్పారు. సీతారాం నాయక్ టిఆర్ఎస్ పార్టీ మారుతున్నారనే పుకార్లపై ఆయన స్పందించారు. దీంతో గురువారం తెలంగాణ భవన్‌లో సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడారు.

ఇద్దరు టిఆర్‌ఎస్ ఎంపిలు పార్టీ మారుతున్నారని రేవంత్ చెప్పడం.. ఆ వార్త కాస్త పేపర్లలో రావడం.. ఓ మైండ్‌గేమ్‌లా ఉందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి దుర్మార్గపు పనులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ పనులు ఆయన ఎదుగుదలకు పని చేయవన్నారు. రేవంత్ ప్రవర్తన అందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతోనే తాను మహబూబాబాద్ ఎంపిగా గెలిచానని సీతారాం నాయక్ చెప్పారు. ఈ నాలుగున్నరేళ్ల టిఆర్ఎస్ పాలనలో తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ఆయన పేర్కొన్నారు.

TRS Mp Sitaram Naik Fires on Revanth Reddy

telangana latest news

Related Stories: