కమలం గూటికి టిఆర్ఎస్ నేత

హైదరాబాద్: టిఆర్ఎస్ నేత బొడిగె శోభ బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం రాష్ట్ర బిజిపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో శోభతోపాటు మాజీ ఎమ్ఎల్ఎ బాలు నాయక్‌ ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ… బొడిగె శోభకు జరిగిన అన్యాయమే టిఆర్‌ఎస్‌ మోసానికి నిదర్శనమని విమర్శించారు. బెయిల్‌పై వచ్చి మహాకూటమి నేతలు ఓట్లు అడుగుతున్నారని, కాంగ్రెస్, టిడిపి పొత్తుకు ప్రాతిపదిక ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టిడిపి నుంచి ఎవరు గెలిచినా టిఆర్‌ఎస్‌లోకి వెళ్తారని జోస్యం చెప్పారు. బొడిగె శోభ మాట్లాడుతూ కెసిఆర్‌ […]

హైదరాబాద్: టిఆర్ఎస్ నేత బొడిగె శోభ బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం రాష్ట్ర బిజిపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమక్షంలో శోభతోపాటు మాజీ ఎమ్ఎల్ఎ బాలు నాయక్‌ ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ… బొడిగె శోభకు జరిగిన అన్యాయమే టిఆర్‌ఎస్‌ మోసానికి నిదర్శనమని విమర్శించారు. బెయిల్‌పై వచ్చి మహాకూటమి నేతలు ఓట్లు అడుగుతున్నారని, కాంగ్రెస్, టిడిపి పొత్తుకు ప్రాతిపదిక ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టిడిపి నుంచి ఎవరు గెలిచినా టిఆర్‌ఎస్‌లోకి వెళ్తారని జోస్యం చెప్పారు. బొడిగె శోభ మాట్లాడుతూ కెసిఆర్‌ బంధువులు రవీందర్‌రావు, సంతోష్‌ల వల్లే తనకు టికెట్‌ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

TRS leader Bodige shobha join in BJP Party

Related Stories: