చీకటి ఒప్పందాన్ని బయట పెట్టాలి!

రాజన్నసిరిసిల్ల: ప్రజా కూటమి ఓ విఫల కూటమి అని టిఆర్‌ఎస్ ఎంపి వినోద్ అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ విషయంలో టిఆర్ఎస్ కు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. రాహుల్‌గాంధీకి 25 ఎంపి సీట్లు అవసరం. తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అందుకే  ఎపితో రాహుల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని వినోద్ పేర్కొన్నారు. కాంగ్రెస్, టిడిపి మధ్య జరిగిన చీకటి […]

రాజన్నసిరిసిల్ల: ప్రజా కూటమి ఓ విఫల కూటమి అని టిఆర్‌ఎస్ ఎంపి వినోద్ అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ విషయంలో టిఆర్ఎస్ కు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. రాహుల్‌గాంధీకి 25 ఎంపి సీట్లు అవసరం. తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అందుకే  ఎపితో రాహుల్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని వినోద్ పేర్కొన్నారు. కాంగ్రెస్, టిడిపి మధ్య జరిగిన చీకటి ఒప్పందం బయటపెట్టాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మహా కూటమిగా జత కట్టి ప్రచారాలు కోనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కూటమికి ధీటుగా టిఆర్ఎస్ సర్కార్ కూడా వన్ సైడ్ వార్ ని ప్రకటించింది.

TRS Mp Vinod Kumar Comments On  Mahakutami

telangana latest news

Related Stories: