కృష్ణం వందే జగద్గురుమ్..

తెలంగాణలో జరుగుతున్నది మహాజగన్నాటకం .. రామ బాణం అర్పిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం, ప్రత్యేక తెలంగాణ ఆర్పిందా తెలంగాణపై ఆంధ్ర నాయకుల కుట్రల యుద్ధం. కుండెడు పాలను ఒక్క విషపు చుక్క కూడా చెడుపుతుంది. తెలంగాణలో ఒక్క సీటు కూడా టీడీపీ గెలిసిన అది నిండు కుండలో విషపు చుక్కనే . అందుకే విషపూరిత ప్రచారాలు చేసే వాళ్ల పట్ల, వాళ్ల పొత్తులపట్ల అప్రమత్తంగా ఉండటం ఇప్పుడు ఒక చారిత్రక అవసరం, […]

తెలంగాణలో జరుగుతున్నది మహాజగన్నాటకం .. రామ బాణం అర్పిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆర్పిందా నిత్య కురుక్షేత్రం, ప్రత్యేక తెలంగాణ ఆర్పిందా తెలంగాణపై ఆంధ్ర నాయకుల కుట్రల యుద్ధం. కుండెడు పాలను ఒక్క విషపు చుక్క కూడా చెడుపుతుంది. తెలంగాణలో ఒక్క సీటు కూడా టీడీపీ గెలిసిన అది నిండు కుండలో విషపు చుక్కనే . అందుకే విషపూరిత ప్రచారాలు చేసే వాళ్ల పట్ల, వాళ్ల పొత్తులపట్ల అప్రమత్తంగా ఉండటం ఇప్పుడు ఒక చారిత్రక అవసరం, అది మన కర్తవ్యం.

వలసవాద మూలాలను కూకటి వేళ్ళతో పెకిలించి ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న స్వరాష్ట్రాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట గలిపి, తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు మహాకూటమి అనే కాలకూట విషాన్ని మనం తినే కంచంలో వేయచూస్తున్నారు. 60 ఏండ్ల పాటుగా ఆగమైన బతుకులు .. ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణను ఆంధ్ర బాబు చేతిలో పెట్టె మళ్లీ మనల్ని వలసవాదుల పాలనలోకి నెట్టేస్తున్నారు. నడవలేని వాడు అమరావతి నుండి వచ్చి పరిగెత్తే మన వాడి కాళ్ళలో కట్టే పెట్టి , నాలుగేళ్ళ తెలంగాణ పసి గొంతు నులిమే కుట్రనే ఈ మాయ కూటమి.

అమరావతి కాళ్ళ ముందు మన అమరుల త్యాగఫలాన్ని తాకట్టు పెడుతూ… కృతిమ నినాదాలతో, అలజడులతో, కులచిచ్చులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పన్నాగాలతో ఆంధ్ర కుటిల రాజనీతితో ముం దుకు వస్తున్నారు. ఆనాడు డిసెంబర్ 9 ప్రకటనతో కంగుతిని ఎలాగైతే కృత్రిమ సమైక్యాం ధ్ర ఉద్యమాన్ని తెర మీదికి తెచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియనును వె నక్కి నెట్టే ప్రయత్నం చేశారో ఇప్పుడు అదే విధంగా తెలంగాణలో రెడ్డి వర్సెస్ వెలమ అనే కృత్రిమ కులచిచ్చు రేపే ప్రయత్నం జరుగుతుంది.

అసలు అన్ని వర్గాల రెడ్డిలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు కెసిఆర్. అందుకోసం రెడ్డి కార్పొరేషన్ నెలకొల్పారు. అంతేకాకుండా తన సిఎంఒతో పాటు, కార్పొరేషన్, ఎంఎల్‌సి, ఎంఎల్‌ఎ, మంత్రులతో కలిపి 75 మంది రెడ్డిలు తన దగ్గర ఉన్నారు. మరి ఇక్కడ కుల వివక్ష ఎక్కడ ఉంది. కేవలం మహాకూటమి విష ప్రచారం మాత్రమే.. ఈ విష కూటమిపై ఇక యుద్ధం అనివార్యం, నిరంతరం. ఇప్పుడే ఈ పసిబిడ్డ తెలంగాణను ఆంధ్ర గద్దల నుండి కాపాడుకోవాలి. మన తెలంగాణను వీరి నుండి కాపాడే కట్టుబానిస ఒక్కడే అది కెసిఆర్. మీకు నచ్చిన నచ్చకున్నా మనకున్నది ఒక్కటే మార్గం .. అది కెసిఆర్ ప్రతిపక్షాల అబద్ధాలు తియ్యగా ఉంటా యి కాబట్టి మింగడానికి సులువుగా ఉంటుంది, కెసిఆర్ చెప్పే నిజాలు, చేసే అభివృద్ధి వారికి చేదుగా ఉంటాయి కాబట్టి గొంతులో దిగడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వారు గుంపుగా వస్తున్నారు. వీరు గుంపుగా ఉన్నంత మాత్రాన సింహాలు అవ్వవు ఎప్పటికైనా అవి గ్రామ సింహాలుగానే గుర్తించబడుతాయి. నిరాశ, నిస్పృహ, రాజకీయ భవిష్యత్తుపై శూన్యతతో ఎవరిని విమర్శించాలో, ఎవరిని విమర్శించకూడదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు మహాకూటమి నాయకులు.

తెరాస పార్టీ పెట్టినప్పటినుండి టిడిపి, కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు కోదండరాం అందరు అయన పెర్సనాలిటీని చూసి అంచనా వేసి ముందుకు వెళ్లి దెబ్బతిన్నారు, తింటున్నారు. కానీ వారు చూడాల్సింది అయన పర్సనాలిటీ కాదు అయన కెపాసిటీని.. ఇంతవరకు వీరు అయన కెపాసిటీని అంచనా వేయలేకపోతున్నారు. అందుకే ఇప్పు డు ఆంధ్రపార్టీతో పెట్టుకొని చారిత్రాత్మక తప్పిదాలు చేస్తున్నారు.

మంచోడు ఎదిగే కొద్దీ శత్రువులు ఎక్కువవుతారు చెడ్డోడు ఎదిగే కొద్ది మిత్రులు ఎక్కువవుతారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది ఇదే .. దుష్ట శక్తులు ఏకమై మహాకూటమి వస్తే, కెసిఆర్ ఒక్కడే మన ముందుకు వస్తున్నారు. మహాకూటమి పరిస్థితి చాట్ల తౌడు కుక్కల పంచాయితీవలె టికెట్‌ల కోసం ముష్టి యుద్ధాలు చేస్తున్నారు. కెసిఆర్ రాజకీయ చతురతతో కుదేలైన ఢిల్లీ పెత్తనం పెద్దరికం, అరాచకం అలాంటిది ఈ మాయ కూటమి పెద్ద లెక్క కాదు.

అభివృద్ధి, సంక్షేమం, నీటి ప్రాజెక్టులు …. ఇవన్నీ కాదు అరవై సంవత్సరాల మన ఆత్మగౌరవ పోరాటానికి అంతిమ విజయం అందించిన పోరాట యోధుడు కెసిఆర్ … ఈ ఒక్కటి చాలదా కెసిఆర్‌కి మల్ల్లీ మల్లీ ఓటు వేయడానికి ? బాబు గారు ఒక్క హైటెక్ సిటీ బిల్డింగ్ చూపిస్తే …. మల్లి ఓటేసి గెలిపించినం వైస్సార్ ఆరోగ్య శ్రీ చూపిస్తే. … మల్లి ఓటేసి గెలిపించినం.

అటువంటిది కలలో కూడా ఊహించనిది, అసాధ్యం అనుకున్న తెలంగాణను తెచ్చిన కెసిఆర్‌కి ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఓటు వేయాల్సిందే!!!!! కెసిఆర్ ఆధ్వర్యంలో నెత్తు రు చిందకుండా యుద్ధం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది అంతిమంగా బంగారు తెలంగాణనే లక్ష్యం. అది ఇప్పుడు నెరవేరబోతోంది… తెలంగాణ దిక్కులు, మూలాలు, పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచామృతాలు, రుతువులు అన్నింటిని జయించిన నాయకుడు కెసిఆర్. ఇప్పుడు మల్లి తెలంగాణ ప్రజల ల నమ్మకాన్ని గెలవబోతున్నాడు ….. అందుకే మనమందరం తెలంగాణ కట్టుబానిస కెసిఆర్ వెంటే నడుద్దాం …

Andhra leaders conspiracy against Telangana

Telangana Latest News