ఇటు ఆరోగ్యం.. అటు ఆహ్లాదం

ఉరుకుల పరుగుల జీవితం, రణగొణ ధ్వనులు నుంచి కాస్త సేదతీరడానికి.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి.. ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? .. పచ్చని ప్రకృతి రమణీయతతో పాటు.. ఆయుర్వేద వైద్యాన్ని పొందడానికి కేరళ దాకా వెళ్లిరండి.. అటు సేద తీరొచ్చు.. ఇటు ఆరోగ్యాన్నీ పెంపొం దించుకోవచ్చు.. అలాగే దగ్గర్లోని కొన్ని పర్యాటక ప్రాంతాలు మనసును ఆహ్లాదపరుస్తాయి.. పచ్చని ప్రకృతి.. పక్షుల కిలకిలరావాలు.. నెమళ్ల నాట్యాలు.. ఆ మధ్యలో చిన్న చిన్న బంగ్లాలు.. పారే సెలయేరులో చిన్నచిన్న చేప పిల్లలు.. ఇంత […]

ఉరుకుల పరుగుల జీవితం, రణగొణ ధ్వనులు నుంచి కాస్త సేదతీరడానికి.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి.. ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? .. పచ్చని ప్రకృతి రమణీయతతో పాటు.. ఆయుర్వేద వైద్యాన్ని పొందడానికి కేరళ దాకా వెళ్లిరండి.. అటు సేద తీరొచ్చు.. ఇటు ఆరోగ్యాన్నీ పెంపొం దించుకోవచ్చు.. అలాగే దగ్గర్లోని కొన్ని పర్యాటక ప్రాంతాలు మనసును ఆహ్లాదపరుస్తాయి..

పచ్చని ప్రకృతి.. పక్షుల కిలకిలరావాలు.. నెమళ్ల నాట్యాలు.. ఆ మధ్యలో చిన్న చిన్న బంగ్లాలు.. పారే సెలయేరులో చిన్నచిన్న చేప పిల్లలు.. ఇంత రమణీయంగా ఉండే దృశ్యాలను కేరళలోని కైరాలీ ఆయుర్వేద గ్రామంలో చూడొచ్చు. పాలక్కడ్ నుంచి గంట ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకుంటాం. ఒక వేళ హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకుంటే కోయంబత్తూరు లేదా కొచ్చి వరకు ఫ్లైట్ లేదా రైలు ప్రయాణంతోనైనా చేరుకోవచ్చు. అక్కడి నుంచి గంటన్నర ప్రయాణిస్తే పాలక్కడ్‌లోని కైరాలీ ఆయుర్వేద గ్రామానికి చేరుకోవచ్చు.

కైరాలీకి చేరుకోగానే పచ్చని కొబ్బరి చెట్లు మనల్ని స్వాగ తిస్తాయి. కైరాలీ గ్రామం 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో 15 ఎకరా ల వరకు రిసార్ట్ నిర్మించారు. మొత్తం 30 భవనాలు ఉంటాయి. ప్రతీ బంగ్లాకి మధ్య కనీసం వంద అడుగుల దూరం ఉంటుంది. మధ్యలో చిన్న పిల్ల కాలువ అందులో చేపలు మనసును ఆహ్లాదపరుస్తాయి. పచ్చని గడ్డి, వివిధ రకాల చెట్లు ఇక్కడ కనిపిస్తాయి. అవన్నీ ఆయుర్వేద వైద్యానికి పనికొచ్చే మొక్కలే. ఇక ఒక్కో గదికో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. పాత కాలం నాటి ఫర్నీచర్ అధునాతను చూపించే బాత్రూమ్‌లు ఉంటాయి. కచ్చితంగా ప్రతీ గదిలో ఒక శంఖం ఉంటుంది. దీనివల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగు తాయని వారి నమ్మకం. ఈ 15 ఎకరా లను వదిలిపెడితే మిగతా అంతా అటవీ ప్రాంతం. దాంట్లో కూడా ఔషధ మొక్కలు, రిస్టార్ట్‌కి అవస రమయ్యే ఆహార పదార్థాలను, వరిని పండిస్తారు.

ప్రత్యేక వైద్యం.. ఇక్కడ మనం సేదతీరడం మాత్రమే కాదు.. మన ఆరో గ్య సమస్యలకు పరిష్కారం కూ డా పొందొచ్చు. ఈ రిస్టార్ట్‌లోకి వెళ్లగానే మనం ఏ వైద్యుడిని సంప్రదించాలి, ఏ సమయానికి అనే సమాచారాన్ని అందిస్తారు అక్కడివారు. అందుకనుగుణంగా మన షెడ్యూ ల్‌ని ప్లాన్ చేస్తారు. మన సమస్యలను బట్టి ఇక్కడ పంచకర్మ, అభ్యంగన, శిరోధార.. వంటి స్పాలని ఏర్పాటు చేస్తారు. ఈ రిసార్ట్‌లో ఆహారం కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇస్తారు. స్పైసీని ఇష్టపడేవాళ్లకి ఈ వంటకాలు నచ్చకపోవచ్చు. కె.వి.రమేష్, గీతా రమేష్ అనే దంపతులు ఈ ఆయుర్వేద గ్రామ నిర్మాణా నికి పూనుకున్నారు. 100 శాతం ఆర్గానిక్ ఆ యుర్వేద వైద్యాన్ని అందిం చాలనే సంకల్పంతో కైరాలీ ఆయుర్వేదిక్ సెం టర్‌ని పాలక్కడ్‌లో ఏర్పాటు చేశారు. పాలక్కడ్‌లోని ఈ రిసార్ట్‌కి కూడా దే శం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచి సైతం పర్యాటకులు వస్తుం టారు. ఇక్కడ స్పా చేయించు కోవడానికి ప్రత్యేకంగా వచ్చే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. ఇక్కడ ఎన్నో హెల్దీ ప్రొడక్ట్‌లు కూడా లభ్యమవుతాయి.

టిప్పుసుల్తాన్ కోట కైరాలీ నుంచి గంట ప్రయాణిస్తే ఈ కోటకి చేరుకోవచ్చు. పాలక్కడ్‌లో ఇది ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. క్రీ.శ. 1766లో ఈ కోటని నిర్మించారు. హైదర్ అలీ ఈ కోటను నిర్మించాడు. టిప్పు సైన్యం ఈ కోటలో ఉం డేది. ఇక్కడే ఏనుగులు, గుర్రాలకు సేవ చేసే వారని ప్రతీతి. ఈ కోట మధ్యలో టౌన్ హాల్ ఉంటుంది. దీన్నే కోట మైదానం అని పిలుస్తారు. ఈ మైదానాన్ని ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్‌గా మార్చేశారు. పబ్లిక్ మీటింగ్‌లకు, ఎగ్జిబిషన్‌లు నిర్వహించడానికి ఈ మైదానాన్ని వాడుతున్నారు. అంతేకాదు.. ఈ కోటలో చిన్న పార్క్ కూడా దర్శనమిస్తుంది. ఇందులో సబ్ జైల్ ఉంది. ఆంజనేయ స్వామి గుడి ఈ కోటలో ఉండడం విశేషం.

మలమ్‌ఫూజా డ్యామ్ కేరళలోని రెండవ అతిపెద్ద రిజర్వాయర్ ఇది. పాలక్కడ్‌కి.. కైరాలీ సెంటర్‌కి మధ్యలో ఇది ఉంటుంది. మలమ్‌ఫూజా నది మీద ఈ డ్యామ్‌ని కట్టారు. మట్టి, రాతితో ఈ డ్యామ్‌ని నిర్మిం చారు. 220 మీటర్ల పొడవు, 355 అడు గుల ఎత్తుతో ఈ డ్యామ్ ఉంటుంది. సు మారు 42వేల హెక్టార్లకు పైగా ఈ డ్యామ్ ద్వారా నీళ్లను సరఫరా చేస్తున్నారు. రెండు ఉపకాలువల వ్యవస్థతో ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఇక్కడికి వెళ్తే డ్యామ్ ఒక్కటే కాకుండా, ఎంట్రెన్స్ గార్డెన్, యాక్షీ, జపనీస్, ఉప్పర్ గార్డెన్‌లు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Specialty of Kerala is Ayurvedic Medicine

Telangana Latest News