విచిత్ర వ్యాధి:ఆసిస్ ఆల్‌రౌండర్‌ రిటైర్మెంట్‌

సిడ్నీ: విచిత్ర వ్యాధి కారణంగా క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జాన్‌ హెస్టింగ్స్‌ ప్రకటించాడు. ఇప్పటికే వన్డే, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన హెస్టింగ్స్ తాజాగా టి20 ఫార్మాట్  నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపాడు. బౌలింగ్‌ చేస్తున్న సమయంలో ఊపిరితిత్తుల్లో తీవ్ర రక్తస్రావం జరుగుతోంది. ఈ వ్యాధి గురించి ఎన్నో రకాల పరీక్షలు చేయించుకున్నా సరైన కారణమేమిటో తెలియలేదు. ఒకవేళ నేను ఇలాగే బౌలింగ్‌ చేస్తుంటే దీని తీవ్రత మరింత పెరిగి అది […]

సిడ్నీ: విచిత్ర వ్యాధి కారణంగా క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జాన్‌ హెస్టింగ్స్‌ ప్రకటించాడు. ఇప్పటికే వన్డే, టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన హెస్టింగ్స్ తాజాగా టి20 ఫార్మాట్  నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపాడు. బౌలింగ్‌ చేస్తున్న సమయంలో ఊపిరితిత్తుల్లో తీవ్ర రక్తస్రావం జరుగుతోంది. ఈ వ్యాధి గురించి ఎన్నో రకాల పరీక్షలు చేయించుకున్నా సరైన కారణమేమిటో తెలియలేదు. ఒకవేళ నేను ఇలాగే బౌలింగ్‌ చేస్తుంటే దీని తీవ్రత మరింత పెరిగి అది మరణానికే దారి తీసే అవకాశం ఉంది. క్రికెట్‌ కోసం నా ప్రాణాలను ఫణంగా పెట్టులేను. అందుకే క్రికెట్‌కు పూర్తిగా దూరం అవుతున్నట్లు జాన్‌ హెస్టింగ్స్‌ చెప్పుకొచ్చాడు. 2010లో భారత్‌పై వన్డే అరంగేట్రం చేసిన హెస్టింగ్స్ కేవలం 29 వన్డేలు, 9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక 2012లో దక్షిణాఫ్రికాపై హెస్టింగ్స్ ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడాడు.

Hastings announces retirement from all formats of cricket