రాఫెల్ ఒప్పందంపై సుప్రీం కీలక వ్యాఖ్యాలు

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం కేసులో సుప్రీం కోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన వాస్తవాలు బహిర్గతం చేస్తేనే ధరలు గురించి చర్చించడం సాధ్యమని సుప్రీం తెలిపింది. ఈ నేపథ్యంలో ధరల వివరాలు బయటకు చెప్పాలా లేదా అనే విషయంపై ముందుగా చర్చ జరగాలని జస్టిస్ ధర్మాసనం పేర్కొంది. యుద్ధ విమానాలనేవి పూర్తిగా వైమానిక దళానికి చెందిన అంశమని, రక్షణ అధికారులకు బదులు సంబంధిత అధికారులు హాజరైతేనే తగిన సమాధానాలు వినగలం… కాబట్టి వైమానిక దళ అధికారులు కోర్టుకు రావాలని   ధర్మాసనం ఆదేశించింది. […]

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం కేసులో సుప్రీం కోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన వాస్తవాలు బహిర్గతం చేస్తేనే ధరలు గురించి చర్చించడం సాధ్యమని సుప్రీం తెలిపింది. ఈ నేపథ్యంలో ధరల వివరాలు బయటకు చెప్పాలా లేదా అనే విషయంపై ముందుగా చర్చ జరగాలని జస్టిస్ ధర్మాసనం పేర్కొంది. యుద్ధ విమానాలనేవి పూర్తిగా వైమానిక దళానికి చెందిన అంశమని, రక్షణ అధికారులకు బదులు సంబంధిత అధికారులు హాజరైతేనే తగిన సమాధానాలు వినగలం… కాబట్టి వైమానిక దళ అధికారులు కోర్టుకు రావాలని   ధర్మాసనం ఆదేశించింది.

రాఫెల్ యుద్ధ విమానాల ధరల వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచారనే విషయంపై కేంద్రం ప్రభుత్వం తరఫు న్యాయవాది వేణుగోపాల్ మాట్లాడుతూ.. ధరల వివరాలను బహిర్గతం చేస్తే శత్రువులు లాభం పొందుతారని, ఈ వివరాలను నిపుణులు మాత్రమే పరిశీలించాలన్నారు. దీనిపై పిటీషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషన్ స్పందిస్తూ.. రాఫెల్‌ ఒప్పందంలో టెండర్‌ ప్రక్రియను తప్పించుకునేందుకు ప్రభుత్వాల మధ్య ఒప్పందం(ఐజిఎ)గా దీన్ని చూపించారని, ధరలు రహస్యంగా ఉంచాలనే నిబంధనను సాకుగా చూపుతున్నారని ఆరోపించారు.

Supreme comments on the Rafale Agreement

Related Stories: