గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరు

బెంగళూరు: క‌ర్నాట‌క మాజీ మంత్రి, వివాదాస్ప‌ద మైనింగ్ వ్యాపారి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ల‌క్ష రూపాయ‌ల పూచీకత్తులో బుధవారం  బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించింది. గ‌త ఆదివారం పోంజీ స్కాం కేసులో బెంగుళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనతోపాటు మరో నిందితుడు అలీఖాన్‌నూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ పేరిట రూ.954కోట్ల వరకు జరిగిన పోంజి స్కాం కేసు నుంచి నిందితులైన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ […]

బెంగళూరు: క‌ర్నాట‌క మాజీ మంత్రి, వివాదాస్ప‌ద మైనింగ్ వ్యాపారి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ల‌క్ష రూపాయ‌ల పూచీకత్తులో బుధవారం  బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించింది. గ‌త ఆదివారం పోంజీ స్కాం కేసులో బెంగుళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనతోపాటు మరో నిందితుడు అలీఖాన్‌నూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ పేరిట రూ.954కోట్ల వరకు జరిగిన పోంజి స్కాం కేసు నుంచి నిందితులైన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని తప్పించేం దుకు గాలి జనార్దన్ రెడ్డి రూ.20 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో మూడురోజుల పాటు జనార్దన్‌రెడ్డి అదృశ్యమవడంతో ఆయన పారిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే ముందే కేసు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్‌ కోసం శనివారం బెంగళూరులోని సిసిబి కార్యాలయానికి తన న్యాయవాదితో కలిసి వచ్చారు. తాను నిరపరాధినని, రాజకీయ కుట్రతోనే తనను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియాకు తెలిపారు.

granted bail to gali janardhan reddy in ponzi scheme

Related Stories: