హైదరాబాద్: రాష్ట్రంలో మహా కూటమి సీట్ల పంచాయతీ మళ్లీ రచ్చకెక్కింది. తెలుగుదేశం ప్రకటించిన మహబూబ్నగర్ స్థానంలోనూ పోటీ చేస్తామంటూ టిజెఎస్ ప్రకటించింది. సొంతంగా 12 స్థానాల్లో టిజెఎస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో టిజెఎస్ అభ్యర్థులను నిలుపుతుంది. స్టేషన్ ఘన్పూర్లో ఇందిర, ఆసిఫాబాద్లో ఆత్రం సక్కు పేర్లను కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది.
తాము పోటీ చేసే మరో 3 స్థానాలను కూడా ప్రకటించనున్నట్టు తెలంగాణ జన సమతి వెల్లడించింది. జనగామ సీటు కూడా తమ పార్టీదే నంటూ ఇప్పుడు కొత్త పేచీ పెడుతోంది. మొదట్లో 8 సీట్లకు ఒకె అన్న టిజెఎస్ ఇప్పుడు 12 స్థానాల్లో పోటీ చేస్తామనటం గమనార్హం. సీట్ల కేటాయింపులపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో ప్రొఫెసర్ కోదండరామ్ చర్చలు జరుపుతున్నారని, తాము బలంగా ఉన్న నియోజకవర్గాలను కచ్చితంగా తమకే కేటాయించాలని టిజెఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.