జిఎస్‌ఎల్‌వి మార్క్3 డి2 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: జిఎస్‌ఎల్‌వి మార్క్3 డి2 వాహక నౌక ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ కె.శివన్ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి బుధవారం సాయంత్రం జిఎస్‌ఎల్‌వి మార్క్‌3 డి2ను ప్రయోగించారు. ముందుగా అనుకున్న సమయం ప్రకారం సాయంత్రం 5.08 గంటలకు జిఎస్‌ఎల్‌వి మార్క్‌3 డి2 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.  ఈ  ప్రయోగం విజయవంతమైన అనంతరం శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..జిశాట్ సిరీస్లో రెండో […]

శ్రీహరికోట: జిఎస్‌ఎల్‌వి మార్క్3 డి2 వాహక నౌక ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ కె.శివన్ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి బుధవారం సాయంత్రం జిఎస్‌ఎల్‌వి మార్క్‌3 డి2ను ప్రయోగించారు. ముందుగా అనుకున్న సమయం ప్రకారం సాయంత్రం 5.08 గంటలకు జిఎస్‌ఎల్‌వి మార్క్‌3 డి2 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.  ఈ  ప్రయోగం విజయవంతమైన అనంతరం శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..జిశాట్ సిరీస్లో రెండో ప్రయోగం విజయవంతమైందని, జిశాట్-29 ని వాహక నౌక 16 నిమిషాల్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టిందన్నారు. భారత్ నుంచి ప్రయోగిస్తున్న అత్యంత భారీ ఉపగ్రహం జిశాట్-29 పదేళ్ల పాటు సేవలందించనుందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజల సమాచార అవసరాలను జి శాట్-29 తీర్చనుందన్నారు. మొత్తం 3,423 కిలోల బరువున్న జీశాట్-29 ఉపగ్రహాన్ని మోసుకెళ్ళిందని చెప్పారు. 2019 జనవరిలో చంద్రయాన్ ప్రయోగం ఉంటుందని శివన్ తెలిపారు.

కాగా, జిశాట్ సిరీస్లో మూడు ఉపగ్రహాలను పంపాల్సి ఉండగా ఇప్పటికే రెండింటిని పంపారు. జిశాట్-19 ఉపగ్రహాన్ని 2017లో పంపగా, జిశాట్ -29ను ఈ రోజు విజయవంతంగా ప్రయోగించారు. మరో ఉగపగ్రహం జిశాట్-11 ను డిసెంబర్ 4న యూరోపియన్ స్పేస్ పోర్టు నుంచి నింగిలోకి పంపనున్నారు.

ISRO’s GSAT-29 successfully launched