వివాహ బంధంతో ఒక్కటైన దీపిక, రణ్‌వీర్‌

ఇటలీ: బాలీవుడ్ ప్రేమజంట దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం ఇటలీలోని లేక్ కోమోలో ఉన్న విల్లా డెల్ బాల్బినెల్లోలో కొంకణి సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పెళ్లి తంతు సాయంత్రం 3 గంటలకు ముగిసినట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకలో దీపిక, రణ్‌వీర్ కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది బంధుమిత్రులు పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి 14, 15వ తేదీల్లో రెండు రోజులపాటు జరగునున్న సంగతి తెలిసిందే. […]

ఇటలీ: బాలీవుడ్ ప్రేమజంట దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం ఇటలీలోని లేక్ కోమోలో ఉన్న విల్లా డెల్ బాల్బినెల్లోలో కొంకణి సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పెళ్లి తంతు సాయంత్రం 3 గంటలకు ముగిసినట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకలో దీపిక, రణ్‌వీర్ కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది బంధుమిత్రులు పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి 14, 15వ తేదీల్లో రెండు రోజులపాటు జరగునున్న సంగతి తెలిసిందే. రేపు సింధి సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది.

వేడుక నిమిత్తం  రణ్‌వీర్‌ సీప్లేన్‌ ధరించగా…దీపిక ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ చేసిన చీరను ధరించినట్లు తెలుస్తోంది. లేక్‌ కోమో తీరంలో ఏర్పాటుచేసిన వివాహ విందు ఫొటోలు, పెళ్లిదుస్తుల్లో రణ్‌వీర్‌, దీపిక ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి జరిగే ప్రాంతం వద్ద భారీ సెక్యూరిటీని విధించారు. వివాహానికి వచ్చే అతిథులు తప్పకుండా శుభలేఖలు తీసుకురావాలని, చేతికి రిస్ట్‌ బ్యాండ్స్‌ ధరించాలని నిబంధనలు విధించారు.ఇక బందువులు, ప్రముఖుల కోసం ఈ నెల 21న బెంగళూరులో, బాలీవుడ్ సెలబ్రిటీల కోసం 28న ముంబయిలో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు.

 Ranveer and Deepika are now officially married

Related Stories: