రాజస్థాన్ లో కమలానికి షాక్‌…

జైపూర్: రాజస్థాన్‌లో అధికార బిజెపి పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందే సీనియర్ నేతలు పార్టీకి టాటా చెబుతున్నారు. పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపి హరీశ్ మీనా బుధవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. హరీశ్‌కు కాంగ్రెస్ కండువా కప్పిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ ఐపిఎస్ అధికారి అయిన మీనా 2014లో బిజెపి […]

జైపూర్: రాజస్థాన్‌లో అధికార బిజెపి పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందే సీనియర్ నేతలు పార్టీకి టాటా చెబుతున్నారు. పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపి హరీశ్ మీనా బుధవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. హరీశ్‌కు కాంగ్రెస్ కండువా కప్పిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ ఐపిఎస్ అధికారి అయిన మీనా 2014లో బిజెపి పార్టీలో చేరారు.

అంతకు మునుపు 2009 నుంచి 2013 వరకు రాజస్థాన్ డిజిపిగా విధులు నిర్వహించారు. హరీశ్ డిజిపిగా సుధీర్ఘకాలంగా కొనసాగడం గమనార్హం. రాజస్థాన్‌లో బలం కలిగిన మీనాలు తూర్పు రాజస్థాన్‌లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వసుంధర రాజె ఆధ్వర్యంలోని బిజెపి సర్కార్ పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న క‌మ‌లానికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. అక్టోబర్ నెలలో వెటరన్ బిజెపి లీడర్ జశ్వంత్ సింగ్ తనయుడు మాజీ ఎంఎల్ఎ మానవేంద్ర సింగ్ కాంగ్రెస్‌లో చేరిన ముచ్చట తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పైలట్‌తో పాటు అశోక్ కూడా బరిలోకి దిగనున్నారు.

BJP MP Harish Meena Join Congress

telangana latest news