కాంగ్రెస్ నట్టేట ముంచింది: గజ్జెల కాంతం

హైదరాబాద్: నమ్ముకున్న వారిని కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని గజ్జెల కాంతం విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒయు విద్యార్థులకు, ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆరు నెలల కిందట పార్టీలో చేరిన వారికి చొప్పదండి టికెట్ ఇచ్చారని, హైకమాండ్‌కు తెలువకుండా కాంగ్రెస్ నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఒయు విద్యార్థులు, ఉద్యమకారులతో తాను సమావేశమవుతున్నానని తెలిపారు. అతి త్వరలో డబ్బులు దండుకున్న వారి పేర్లు […]

హైదరాబాద్: నమ్ముకున్న వారిని కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని గజ్జెల కాంతం విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒయు విద్యార్థులకు, ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆరు నెలల కిందట పార్టీలో చేరిన వారికి చొప్పదండి టికెట్ ఇచ్చారని, హైకమాండ్‌కు తెలువకుండా కాంగ్రెస్ నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఒయు విద్యార్థులు, ఉద్యమకారులతో తాను సమావేశమవుతున్నానని తెలిపారు. అతి త్వరలో డబ్బులు దండుకున్న వారి పేర్లు బయటపెడుతామని హెచ్చరించారు. ప్రతి విషయాన్ని హైకమాండ్‌కు చెబుతామన్నారు. మరో వైపు కాంగ్రెస్‌కు మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ రాజీనామా చేశారు.

Gajjala Kantham Fire on Congress Party

Telangana news

Related Stories: