పేలిన ఐఫోన్ X స్మార్ట్‌ఫోన్…

అమెరికా: వాషింగ్టన్ లో నివాసం ఉండే వ్యక్తికి చెందిన ఐఫోన్ X స్మార్ట్‌ఫోన్ బుధవారం పేలింది. ఈ ప్రమాదంలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. రాహెల్ మహమ్మద్ అనే వ్యక్తి జనవరిలో ఐఫోన్ X ఫోన్ ను కొనుగోలు చేశాడు. తాజాగా యాపిల్ సంస్థ రిలీజ్ చేసిన ఐఒఎస్ 12.1 ఒఎస్‌ను ఫోన్‌లో అప్‌డేట్ చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఫోన్ చార్జింగ్ పెట్టి ఉంది. అప్పుడే ఫోన్ లో నుంచి  పొగ వచ్చింది. తక్షణమే అప్రమత్తమైన రాహెల్ ఫోన్ […]

అమెరికా: వాషింగ్టన్ లో నివాసం ఉండే వ్యక్తికి చెందిన ఐఫోన్ X స్మార్ట్‌ఫోన్ బుధవారం పేలింది. ఈ ప్రమాదంలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. రాహెల్ మహమ్మద్ అనే వ్యక్తి జనవరిలో ఐఫోన్ X ఫోన్ ను కొనుగోలు చేశాడు. తాజాగా యాపిల్ సంస్థ రిలీజ్ చేసిన ఐఒఎస్ 12.1 ఒఎస్‌ను ఫోన్‌లో అప్‌డేట్ చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఫోన్ చార్జింగ్ పెట్టి ఉంది. అప్పుడే ఫోన్ లో నుంచి  పొగ వచ్చింది. తక్షణమే అప్రమత్తమైన రాహెల్ ఫోన్ చార్జింగ్ తీసి ఫోన్‌ను చేతిలోకి తీసుకోని చూడగా, అప్పటికే ఫోన్ బాగా వేడిగా అనిపించింది. వెంటనే ఆ వ్యక్తి ఫోన్ ను కింద పడేయగా ఫోన్ పేలిపోయింది. ఈ విషయంపై యాపిల్ సంస్థను తాను సంప్రదించానని రాహెల్ తెలిపాడు. కాగా, ఐఫోన్ X పేలిన విషయంపై యాపిల్ ఇంకా స్పందించలేదని ఆ వ్యక్తి చెబుతున్నాడు. బ్యాటరీ లేదా సాఫ్ట్‌వేర్ సమస్య వల్లే ఫోన్ పేలి ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి యాపిల్ ఫోన్లు పేలడం చాలా అరుదుగా జరుగుతుందంటున్నారు. దీనిపై యాపిల్ త్వరలోనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Iphone x Smartphone Blasted At Washington

telangana latest news

Related Stories: