అధికారం మళ్లీ టిఆర్‌ఎస్‌దే : కెటిఆర్

ఖమ్మం : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వందకు పైగా స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. సత్తుపల్లి టిఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, తుమ్మల, ఎంపి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎంఎల్‌సి బాలసాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. సత్తుపల్లిలో పిడమర్తి విజయం ఖాయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణోద్యమంలో పిడమర్తి కీలక పాత్ర పోషించారని ఆయన […]

ఖమ్మం : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వందకు పైగా స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. సత్తుపల్లి టిఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, తుమ్మల, ఎంపి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎంఎల్‌సి బాలసాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. సత్తుపల్లిలో పిడమర్తి విజయం ఖాయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణోద్యమంలో పిడమర్తి కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. పిడమర్తికి సిఎం కెసిఆర్‌తో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని కెటిఆర్ పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లికి గోదావరి జలాలు తరలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధికార దాహంతో కాంగ్రెస్, టిడిపిలు మహాకూటమిగా ఏర్పడి ఓట్ల కోసం వస్తున్నాయని, ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. కూటమి నేతలు సీట్లు పంచుకునేలోపే మనం స్వీట్లు పంచుకుంటామని ఆయన తెలిపారు.

TRS Candidate Pidamarti Ravi filed Nomination

Related Stories: