అరచేతిలో ఎడిటింగ్ స్టూడియో

సోషల్ మీడియాని వినియోగించే వాళ్లలో రెండు రకాల వాళ్లుంటారు. అక్కడ కనిపించే వీడియోని లైక్, షేర్ చేసేవాళ్లు మొదటి రకం. వాటిని రూపొందించే వాళ్లు రెండో రకం. చాలా మంది మొదటి  రకానికే చెందుతారు. కారణం వాళ్లకి వీడియో తీయడంపైన ఆసక్తి లేకపోవడం కాదు. ఈ వీడియో ఎడిటింగ్ యాప్స్ తెలియక పోవడమే! యాప్‌స్టోర్, ప్లేస్టోర్‌లలో ఎక్కువగా డౌన్‌లోడ్ అయ్యే యాప్స్‌లో “ఫిల్మోరాగో” ఒకటి. ఎడిటింగ్‌కి కావాల్సిన వీడియోలూ, ఫొటోల్ని ఫోన్ నుంచి ఎంపిక చేసుకుంటే అవన్నీ […]

సోషల్ మీడియాని వినియోగించే వాళ్లలో రెండు రకాల వాళ్లుంటారు. అక్కడ కనిపించే వీడియోని లైక్, షేర్ చేసేవాళ్లు మొదటి రకం. వాటిని రూపొందించే వాళ్లు రెండో రకం. చాలా మంది మొదటి  రకానికే చెందుతారు. కారణం వాళ్లకి వీడియో తీయడంపైన ఆసక్తి లేకపోవడం కాదు. ఈ వీడియో ఎడిటింగ్ యాప్స్ తెలియక పోవడమే!

యాప్‌స్టోర్, ప్లేస్టోర్‌లలో ఎక్కువగా డౌన్‌లోడ్ అయ్యే యాప్స్‌లో “ఫిల్మోరాగో” ఒకటి. ఎడిటింగ్‌కి కావాల్సిన వీడియోలూ, ఫొటోల్ని ఫోన్ నుంచి ఎంపిక చేసుకుంటే అవన్నీ ఈ యాప్‌లో ఒకే చోట కనిపిస్తాయి. తర్వాత ఎడిటింగ్ మొదలు పెట్టొచ్చు. ఈ దశలో ఫొటోలూ, వీడియో క్లిప్పుల్ని కావాల్సిన వరసలో పెట్టి యాప్‌లోని రెడీమెడ్ థీమ్స్ నుంచి నచ్చిన దాన్ని ఎంపిక చేసుకుంటే మొత్తం వీడియో సిద్ధమైపోతుంది. వీడియో మధ్యలో కొంత భాగం వేగంగా లేదా నెమ్మది (స్లోమోషన్)గా వెళ్లేలా కూడా చేసుకోవచ్చు. దీన్లో ఉండే “పిక్చర్‌ఇన్ పిక్చర్ ఫీచర్ ద్వారా ఒక వీడియో వచ్చేలా చేసుకోవచ్చు. వీడియో సిద్ధమయ్యాక ఫోన్లో ఉన్న సోషల్ మీడియా యాప్స్ ద్వారా దాన్ని షేర్ చెయ్యెచ్చు.

అడోబ్ ప్రిమియర్ క్లిప్: ఈ యాప్‌లో ఆటోమెటిక్, ప్రీఫామ్ అనే రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఆటోమేటిక్‌లో ఏదైనా వీడియోకి బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌ని ఎంపిక చేసుకోవచ్చు. వీడియోని పూర్తిగా మార్చాలనుకుంటే ఫ్రీఫామ్‌లో ఎడిట్ చేయాలి. కావాల్సిన వీడియోలూ, ఫొటోల్ని ఒక చోట చేర్చి వాటిని క్రమపద్ధతిలో పెట్టాలి. ఆపైన ఆయా భాగాలకు సంబంధించిన వేగం, సైజు, రంగు, నేపథ్య సంగీతం.. ఇలా అన్నింటినీ ఎంపిక చేసుకుని ఆ ఫిల్టర్స్‌ని అప్లై చేస్తే వీడియో సిద్ధమవుతుంది. మిగతా యాప్స్‌లో లేనన్ని షేడ్, మోషన్ ఆప్షన్స్ దీన్లో ఉంటాయి. ఈ యాప్ వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్క్ కూడా.

వీడియో షో: దీన్లో సాధారణంగా తీసిన వీడియోకి రంగుల్నీ వేగాన్నీ, సంగీతాన్నీ జత చేసి ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే కావాల్సిన ఫొటోల్ని ఉపయోగించి వీడియోని తయారు చేసుకోవచ్చు. వీడియోలో కనిపించేలా వాటికి సంబంధించిన విషయాల్ని అక్షర రూపంలో కనిపించేలా చేయ్చొచ్చు. “ఎఫ్ ఎక్స్‌” హంగులూ ఇవొచ్చు. కావాల్సిన వస్తువులే కనిపించేలా రివర్స్ ఫిల్టర్ నీ ఉపయోగించుకోవచ్చు. వీడియో సంగీతం మీద ప్రధానంగా దృష్టి పెట్టేవాళ్లకి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో సొంత మ్యూజిక్‌నీ జోడించవచ్చు. లైవ్ డబ్బింగ్ చెప్పొచ్చు. ఆడియో వేగాన్నీ, తీవ్రతనీ నియంత్రిచ వచ్చు.

మూవీ మేకర్‌: ఈ యాప్ పూర్తి పేరు మూవీ మేకర్ ఫిల్మ్ మేకర్ యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. ఇది వీడియోల్ని ఎడిట్ చేసే యాప్ మాత్రమే కాదు, వీడియో షేరింగ్ ఆప్ కూడా. కాబట్టి మన వివరాలతో అకౌంట్ తెరవాలి. యాప్‌లోకి వెళ్లాక దాంట్లో ఉండే ప్లస్ గుర్తుని ట్యాప్ చేసి కావాల్సిన వీడియోలూ, ఫొటోల్ని ఎంపిక చేసుకోవచ్చు. ఎడిటింగ్ సమయంలో వీడియోకి యాప్‌లో ఉండే వందల సంఖ్యలోని స్టిక్కర్లనీ, ఎఫ్‌క్ట్‌నీ జోడించవచ్చు. దీన్లో అధిక సంఖ్యలో ఫిల్టర్లు ఉంటాయి. కాబట్టి వీడియోకి కావాల్సిన చిన్న చిన్న హంగుల్నీ తేవొచ్చు. యాప్‌లో ఉండే నేపథ్య సంగీతం కాకుండా సొంత సంగీతాన్నీ ఎంచుకోవచ్చు. వీడియో సిద్ధం అయ్యాక అది మన అకౌంట్‌లో ఉంటుంది. దాన్ని డౌన్ లోడ్ చేసు కోవచ్చు. ఆప్‌లోనే మిగతా వారితో షేర్ చేయొచ్చు.

మెజిస్టో: అత్యంత సులభంగా ఉపయోగించడానికి వీలుండే వీడియో ఎడిటింగ్ ఆప్‌లలో ఇదొకటి. కొన్ని నిమిషాల్లో కొద్ది క్లిక్స్‌తోనే ఫొటోలూ, వీడియోల్ని మంచి కథలుగా మలుస్తుందీ ఆప్. ఫొటోలూ, వీడియోల్ని ఎంపిక చేశాక అవి ప్రేమ,డ్యాన్స్, జ్ఞాపకాలు, ఇల్లు కథనం…వీటిలో ఏ భాగానికి చెందుతాయో చెప్పాలి. అందుకు సరిపోయే నేపథ్య సంగీతం క్లిప్‌లు వస్తాయి. వీడియో, ఫొటోలోని వ్యక్తుల ముఖకవళికలూ, వారు చేసే పనుల్ని గుర్తించి దానికి తగ్గ సంగీతాన్ని సూచించేలా కృత్రిమమేధను ఈ సంస్థ ఉపయోగిస్తుంది. కాబట్టి సంగీతం చక్కగా సరిపోతుంది. అక్కడ ఉండే సంగీతం క్లిప్‌లే కాకుండా సొంతవీ ఎంచుకోవచ్చు. ఇవి కాకుండా అలైవ్,ఇన్‌షాట్, ఓవర్ వీడి యో, క్విక్, కూట్, కట్, వివా వీడియో లాంటి యాప్స్ కూడా వీడియో ఎడిటింగ్‌ని సులభతరం చేస్తున్నాయి. ఈ వీడియో ఎడిటింగ్ మొబైల్ ఆప్‌లను మనకున్న సమయం, అభిరుచిని బట్టి ఎంచు కోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. సృజనను బయటికి తీయండి, మీ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయండి.

The Best Video Editing Apps for Users

Telangana Breaking News