వాళ్ల ఖాతాల్లో 10 లక్షలు ఉండాలి: కెసిఆర్

సిద్దిపేట: కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేసి మీ దీవెనతో ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించానని కెసిఆర్ తెలిపారు. రైతులు అప్పులు లేకుండా బ్యాంకుల్లో రూ.10 లక్షలు ఉండేలా జీవించాలన్నారు. ఇప్పుడు కూడా 100 సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ధనవంతులైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలోనే […]

సిద్దిపేట: కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేసి మీ దీవెనతో ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించానని కెసిఆర్ తెలిపారు. రైతులు అప్పులు లేకుండా బ్యాంకుల్లో రూ.10 లక్షలు ఉండేలా జీవించాలన్నారు. ఇప్పుడు కూడా 100 సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ధనవంతులైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలోనే అని చెప్పుకోవాలన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పొగిడారు. 2001లో స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించానని, స్వామివారి దయవల్ల ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపడతానని ఆకాంక్షించారు.  సిద్దిపేట టిఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.  గజ్వేల్ అభ్యర్థిగా ఆర్‌డిఒ కార్యాలయంలో మధ్యాహ్నం 2.34 నిమిషాలకు కెసిఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.