అంచనాలను మించిన టాటా స్టీల్

న్యూఢిల్లీ: స్టీలు దిగ్గజం టాటా స్టీల్ రెండో త్రైమాసిక ఫలితాల్లో దుమ్మురేపింది. సెప్టెంబర్ 30 ముగింపు నాటి క్యూ2(జులైసెప్టెంబర్)లో సంస్థ నికర లాభం రూ.3,116 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.1,018 కోట్లుగానే ఉంది. నిపుణులు టాటా స్టీల్‌కు రూ.2,247 కోట్లు నికర లాభం వస్తుందని అంచనా వేశారు. అయితే ఈ అంచనాలను మించి సంస్థ లాభాలను ప్రకటించింది. ముంబైకి చెందిన ఈ కంపెనీ మొత్తం స్టీలు డెలివరీలో 15 శాతం […]

న్యూఢిల్లీ: స్టీలు దిగ్గజం టాటా స్టీల్ రెండో త్రైమాసిక ఫలితాల్లో దుమ్మురేపింది. సెప్టెంబర్ 30 ముగింపు నాటి క్యూ2(జులైసెప్టెంబర్)లో సంస్థ నికర లాభం రూ.3,116 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.1,018 కోట్లుగానే ఉంది. నిపుణులు టాటా స్టీల్‌కు రూ.2,247 కోట్లు నికర లాభం వస్తుందని అంచనా వేశారు. అయితే ఈ అంచనాలను మించి సంస్థ లాభాలను ప్రకటించింది. ముంబైకి చెందిన ఈ కంపెనీ మొత్తం స్టీలు డెలివరీలో 15 శాతం వృద్ధిని చూపింది. దీనిలో భారత్ డెలివరీలు 58 శాతం ఉన్నాయి. భారత్‌లో స్టీల్ డిమాండ్ పెరగడంతో సంస్థ మంచి లాభాలను నమోదు చేసిందని, అలాగే దిగుమతులు ఆందోళన కలిగిస్తున్నాయని కంపెనీ సిఇఒ టివి నరేంద్రన్ అన్నారు.

అపోలో టైర్స్ లాభం 4 శాతం జంప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో(జూలై-సెప్టెంబర్)లో అపోలో టైర్స్ నికర లాభం రూ.146 కోట్ల తో 4 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.140 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,269 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.3,496 కోట్లుగా ఉంది. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఇలో షేరు ధర 4 శాతం పెరుగుదలతో రూ.222 వద్ద ముగిసింది.

16 శాతం పెరిగిన బ్రిటానియా లాభం
రెండో త్రైమాసిక ఫలితాల్లో ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం 16 శాతం పెరిగింది. ఈ క్యూ2లో నికర లాభం రూ.303 కోట్లకు పెరిగింది. అయితే గత క్యూ2లో లాభం రూ.261 కోట్లుగా ఉందని బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,596 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.2,914 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డి వరుణ్ బెర్రి చెప్పారు. ఎబిటా రూ.378 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.454 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు.

సన్‌ఫార్మా నష్టం 219 కోట్లు
సెప్టెంబర్ 30 ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా నిరాశపర్చింది. సంస్థ రూ.218.8 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.912 కోట్లుగా ఉంది. ఇందుకు రూ. 1214 కోట్లమేర వన్‌టైమ్ నష్టం కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం పుంజుకుని రూ.6,938 కోట్లను చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1531 కోట్లతో 11 శాతం వృద్ధిని సాధించింది. ఇబిటా మార్జిన్లు 20.7 శాతం నుంచి 22.1 శాతానికి పెరిగాయి. ఫలితాలపై ముందు అంచనాలతో ట్రేడింగ్‌లో సన్ ఫార్మా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 562 దిగువన ముగిసింది. అయితే మార్కెట్లు ముగిశాక కంపెనీ క్యూ2 ఫలితాలు విడుదల చేసింది. బుధవారం కూడా ఈ షేరులో తీవ్ర మార్పులు చోటుచేసుకోనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tata Steel Q2 net profit jumps to Rs 3,604.2 crore

Telangana Breaking News

Related Stories: