రెండో రోజు 39

రాష్ట్రవ్యాప్తంగా 34 నియోజకవర్గాలకు రెండో రోజు 39 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో స్వతంత్రులు 20 మంది, బిజెపి, బిఎల్‌పి, న్యూ ఇండియా పార్టీల నుంచి ముగ్గురు చొప్పున, పిపిఐ, శ్రమజీవి పార్టీల నుంచి ఇద్దరు చొప్పున, టిఆర్‌ఎస్, బిఎస్‌పి, సమాజ్‌వాది పార్టీ, సిపిఐ(ఎం), నయ భారత్ పార్టీ, ఆలిండియా సమర పార్టీల నుంచి ఒకటి చొప్పున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు […]

రాష్ట్రవ్యాప్తంగా 34 నియోజకవర్గాలకు రెండో రోజు 39 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో స్వతంత్రులు 20 మంది, బిజెపి, బిఎల్‌పి, న్యూ ఇండియా పార్టీల నుంచి ముగ్గురు చొప్పున, పిపిఐ, శ్రమజీవి పార్టీల నుంచి ఇద్దరు చొప్పున, టిఆర్‌ఎస్, బిఎస్‌పి, సమాజ్‌వాది పార్టీ, సిపిఐ(ఎం), నయ భారత్ పార్టీ, ఆలిండియా సమర పార్టీల నుంచి ఒకటి చొప్పున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు 48 నామినేషన్లు రాగా రెండో రోజు వచ్చిన వాటితో మొత్తం సంఖ్య 87కు చేరింది. నియోజకవర్గాల వారీగా మంగళవారం వచ్చిన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్‌కు స్వతంత్ర అభ్యర్థిగా అన్నం దేవేందర్, జుక్కల్‌కు టిఆర్‌ఎస్ నుంచి హన్మంత్ షిండే, ఎల్లారెడ్డికి బిఎస్‌పి నుంచి టి.బాల్‌రాజు, నిజామాబాద్ అర్బన్‌కు స్వతంత్ర అభ్యర్థిగా ఆర్. చక్రధర్, కోరుట్లకు స్వతంత్ర అభ్యర్థిగా జి. భూమయ్య, జగిత్యాలకు స్వతంత్ర అభ్యర్థిగా వేముల కరుణకర్ రెడ్డి, ధర్మపురికి నయ భారత్ పార్టీ నుంచి మహిపాల్, పెద్దపల్లికి స్వతంత్ర అభ్యర్థిగా ఆర్. కాంతరావు, చొప్పదండికి బిజెపి నుంచి జనపట్ల స్వామి, హుజురాబాద్‌కు పిరమిడ్ పార్టీ నుంచి చింతా అనిల్‌కుమార్, నారాయణ్‌ఖేడ్‌కు బిజెపి నుంచి గొల్ల నగేష్ యాదవ్, అంధోల్‌కు బిఎల్‌పి నుంచి పోతురాజు జయలక్ష్మీ, దుబ్బాకకు స్వతంత్ర అభ్యర్థిగా భుజంగం గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నుంచి బొనాల విజయ్ కుమార్, మల్కాజ్‌గిరికి శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, కుత్భుల్లాపూర్‌కు ఆలిండియా సమతా పార్టీ నుంచి సిద్ధేశ్వర్లు, కూకట్‌పల్లికి శ్రమజీవి పార్టీ నుంచి బోజ్‌రాజు,

ఎల్‌బి నగర్‌కు న్యూఇండియా పార్టీ నుంచి డి. జయప్రకాశ్, స్వతంత్ర అభ్యర్థిగా రాంబాబు రెడ్డి, జూబ్లీహిల్స్‌కు న్యూ ఇండియా పార్టీ నుంచి షైక్ గోష్ పాషా, సికింద్రాబాద్‌కు స్వతంత్ర అభ్యర్థిగా సత్తిరెడ్డి, కొడంగల్‌కు బిఎల్‌పి నుంచి కె.వెంకటేశ్వర్లు, దేవరకద్రకు స్వతంత్ర అభ్యర్థిగా కె.నర్సింహారెడ్డి, గద్వాలకు బిజెపి నుంచి గోపాల్ రెడ్డి, కొల్లాపూర్‌కు స్వతంత్ర అభ్యర్థిగా ఇ.శ్రీనివాస్, నల్లగొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గండికోట వెంకటలక్ష్మణ్, ఆలేరుకు స్వతంత్ర అభ్యర్థిగా కల్లూరి రామచంద్రారెడ్డి, వరంగల్ ఈస్ట్ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా రాజనాల శ్రీహరి, సత్యనారాయణ చారి, పిరమిడ్ పార్టీ నుంచి కిషన్ రెడ్డి, ఇల్లందుకు స్వతంత్ర అభ్యర్థులుగా వై.సత్యం, పి.ముత్తయ్య, ఖమ్మంకు స్వతంత్ర అభ్యర్థిగా కె.సాయికుమార్, పాలేరుకు స్వతంత్ర అభ్యర్థిగా ఎల్. వెంకన్న, మధిరకు బిఎల్‌పి నుంచి కోట రాంబాబు, వైరాకు సిపిఐ(ఎం) బి. వీరభద్రం, అశ్వారావుపేటకు స్వతంత్ర అభ్యర్థిగా కె. కొల్లయ్య నామినేషన్లు దాఖలు చేశారు.

39 candidates file nominations on Day 2

Telangana News

Related Stories: