నేడు గజ్వేల్‌లో కెసిఆర్ నామినేషన్

నేడే కెసిఆర్ నామినేషన్ కోనాయిపల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు బుధవారం నామినేషన్ వేయనున్నారు. వెంకటేశ్వర స్వామి జన్మనక్షత్ర సమయంలో టిఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మక ర లగ్నం. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.50 గంటల వరకు కుంభలగ్నం. ఈ రెండు ముహూర్తాలలో నామినేషన్ […]

నేడే కెసిఆర్ నామినేషన్
కోనాయిపల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు బుధవారం నామినేషన్ వేయనున్నారు. వెంకటేశ్వర స్వామి జన్మనక్షత్ర సమయంలో టిఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మక ర లగ్నం. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.50 గంటల వరకు కుంభలగ్నం. ఈ రెండు ముహూర్తాలలో నామినేషన్ దాఖలు చేస్తే కెసిఆర్‌కు మరోసారి రాజయోగం వస్తుందని ఆయనకు పండితులు సూచించారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 2.30 నామినేషన్ వేసేందుకు కెసిఆర్ ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కెసిఆర్ వెంట సిద్దిపేట అభ్యర్థి అయిన మంత్రి హరీశ్‌రావు కూడా తోడుగా వెళ్ళనున్నారు. సిఎం కెసిఆర్ తనయుడు, అపధ్దర్మ మంత్రి కె.టి.రామారావు మాత్రం ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఎప్పటిలాగే నామినేషన్ పత్రాలతో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బుధవారం కెసిఆర్ తన వ్యవసాయక్షేత్రం నుంచి కోనాయిపల్లిలోని దేవాలయానికి వెళ్లి, అక్కడ నామినేషన్ పత్రాలను ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అక్కడ నుంచి గజ్వేల్‌కు బయలుదేరి వెళ్తారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు.
1985 నుంచి కోనాయిపల్లి దేవాలయం సెంటిమెంట్
టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్‌కు 1985 నుంచి కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం సెంటిమెంట్. 1985లో ఆయన ఎంఎల్‌ఎగా ఎన్నికైనప్పుడు సిద్దిపేట నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి పాదాల ముం దు నామినేషన్ పత్రాలు ఉంచి, వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకుని నామినేషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో కెసిఆర్ కోనాయిపల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతనే నామినేషన్ దాఖలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసే ముందు కూడా ఇక్కడే నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.

KCR nomination in Gajewel today

Telangana News

Related Stories: