డిపాజిట్ల గల్లంతే లక్ష్యం…

 కెసిఆర్ గెలుపు ఆనాడే ఖాయమైంది అభివృద్ధి కనిపించకుండా ప్రజల కళ్లకు గంతలు కట్టలేరు : గజ్వేల్‌లో హరీశ్ మన తెలంగాణ/గజ్వేల్: కెసిఆర్ గెలుపు ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినపుడే ఖాయమైందని, ఇప్పుడు ప్రత్యర్థి డిపాజిట్ గల్లంతు చేయటమే లక్షంగా కృషిచేయాల్సి ఉందని మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక ప్రజ్ఞగార్డెన్స్ ఆవరణలో గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బిజెపి అధ్యక్షులు, ఇతర కార్యవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆ […]

 కెసిఆర్ గెలుపు ఆనాడే ఖాయమైంది
అభివృద్ధి కనిపించకుండా ప్రజల కళ్లకు గంతలు కట్టలేరు : గజ్వేల్‌లో హరీశ్

మన తెలంగాణ/గజ్వేల్: కెసిఆర్ గెలుపు ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినపుడే ఖాయమైందని, ఇప్పుడు ప్రత్యర్థి డిపాజిట్ గల్లంతు చేయటమే లక్షంగా కృషిచేయాల్సి ఉందని మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక ప్రజ్ఞగార్డెన్స్ ఆవరణలో గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బిజెపి అధ్యక్షులు, ఇతర కార్యవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎంతో అంకిత భావంతో పార్టీలో పనిచేసిన బిజెపి కార్యకర్తలు, నాయకులు కెసిఆర్ చేసిన అభివృద్ధ్దికి ఆకర్శితులై గులాబీ పార్టీలో చేరటంపట్ల ఆయన అభినందించారు. టిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.

రానున్న కొద్ది రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండ పోచమ్మ సాగర్ నుంచి సాగునీరు రానుందని, రైలు సౌకర్యం కూడా గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు. ఇంత అభివృద్ధ్దిని కండ్లుండీ చూడలేని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎంత వక్రీకరించినా కనిపించే అభివృద్ధ్దిని చూడకుండా ప్రజల కండ్లకు గంతలు కట్టలేరని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదన్న వారిని ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిలోపల తిప్పి చూపండి వారికి అర్థమవుతుందన్నారు. ఈ సారి ఎన్నికల్లో కెసిఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలన్న పట్టుదలతో సమిష్టిగా కృషిచేసి విజయాన్ని కెసిఆర్‌కు కానుకగా ఇద్దామని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆధ్వర్యంలో గజ్వేల్ ,వర్గల్, ములుగు, మర్కూక్, తదితర మండలాల బిజెపి అధ్యక్షులు, కార్యకర్తలకు మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పోరేషన్ ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

 Harish Rao Election Campaign In Gajwel Constituency

Telamgana News

Related Stories: