సంపద పంచుతాం..పింఛన్‌ పెంచుతాం

మనతెలంగాణ/హైదరాబాద్ ఆలోచించి ఓటు వేయాలి…మన తలరాతను మనమే మార్చుకోవాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మంగళవారం నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో ఏర్పాటుచేసిన దివ్యాంగుల కృతజ్ఞత సభ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ వికలాంగుల స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్‌ను గెలిపించుకోవాలన్న పట్టుదలతో సుదూర ప్రాం తాల నుంచి వికలాంగులు తరలివచ్చారన్నారు. ఆదాయాన్ని పెంచా లి..పేదవారికి పంచాలన్న […]

మనతెలంగాణ/హైదరాబాద్
ఆలోచించి ఓటు వేయాలి…మన తలరాతను మనమే మార్చుకోవాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. మంగళవారం నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో ఏర్పాటుచేసిన దివ్యాంగుల కృతజ్ఞత సభ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ వికలాంగుల స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్‌ను గెలిపించుకోవాలన్న పట్టుదలతో సుదూర ప్రాం తాల నుంచి వికలాంగులు తరలివచ్చారన్నారు. ఆదాయాన్ని పెంచా లి..పేదవారికి పంచాలన్న నినాదంతో కెసిఆర్ ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పడగానే వికలాంగుల పింఛన్ రూ. 3,016లకు పెంచుతామని ఆయన హామినిచ్చారు. దివ్యాంగులకు కెసిఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని ఆయన తెలిపారు. బడ్జెట్‌లో పేదవారి సం క్షేమం కోసం 43 శాతం ఖర్చు చే స్తోంది తెలంగాణ ప్రభుత్వమే అ న్నారు. పేదవారి కోసం 453 పథకాలను అమల్లోకి తీసుకొచ్చామన్నారు. డిసెంబర్ 11వ తేదీ తరువాత ప్రభుత్వం ఏర్పడగానే వికలాంగుల పింఛన్ పెంపుఖాయమన్నారు.పింఛన్ వలన వికలాంగులు కోటీశ్వరులు కాదని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపినట్టు అవుతుందన్నారు. దివ్యాంగుల బడ్జెట్‌ను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు.
సుమారు 5 లక్షల మందికి పింఛన్‌ల పంపిణీ
టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే రూ.500లు ఉన్న పింఛన్‌ను రూ.1500 లకు పెంచింది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ఈ పింఛన్‌ను అందుకుంటున్నారని, దీనికిగాను రూ.880 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. దివ్యాంగులను పెండ్లి చేసుకున్న వారికి లక్ష రూపాయల ప్రోత్సాహం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.10 కోట్ల వరకు దివ్యాంగులకు సబ్సిడీ రుణాలను ఇచ్చామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్‌ను కల్పించామని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో కూడా 5 శాతం రిజర్వేషన్లను దివ్యాంగులకు కల్పిస్తున్నామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఐటి పార్కులు, ప్రతి జిల్లాల్లో దివ్యాంగ భవనాలు నిర్మిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. దివ్యాంగుల హాస్టళ్లలో వసతులను పెంచామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేసే విషయమై సిఎంతో చర్చిస్తానన్నారు. రాష్ట్రంలో 43 లక్షల మందికి ఆసరా పింఛన్లను ఇస్తున్నామని, దీనికోసం రూ.5,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌లో 43 శాతం నిధులను పేదల సంక్షేమానికే ఖర్చు చేస్తున్నామన్నారు. గాంధీ భవన్ చూస్తుంటే గాంధీ ఆస్పత్రిని తలపిస్తోందని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు గ్లూకోజ్ బాటిళ్లను పెట్టుకొని దీక్షలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీట్ల కోసమే కొట్లాడుకుంటున్న వారికి పదవిస్తే ఏం చేస్తారు అని కెటిఆర్ ప్రశ్నించారు. పగటిపూట సీట్లు ప్రకటిస్తే గొడవలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ జాబితాను అర్థరాత్రి ప్రకటించిందన్నారు. టిఆర్‌ఎస్, బిజేపి రాజకీయ ప్రత్యర్థులుగానే ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. ఆంధ్రా సిఎం చంద్రబాబు తెలంగాణపై ప్రేమ ఎందుకు ఉంటుందని, అలాంటి బాబు చేతికి తెలంగాణ జుట్టును అప్పచెబుతారా అని ఆయన ప్రశ్నించారు. నల్లగొండ ఫ్లోరోసిస్ కాంగ్రెస్ పుణ్యమేనన్నారు. చిత్ర, విచిత్రమైన మనుషులు ఒకచోట చేరి మహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు. నలభై సంవత్సరాల విభేదాలు మరిచి కెసిఆర్‌ను ఓడించేందుకు ఒక్కటయ్యారని ఆయన విమర్శించారు. కెసిఆర్ పనిచేసే మనిషని, మరోసారి ఆయన్ను ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. పనిచేసే కెసిఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తేనే తెలంగాణ వనరులు తెలంగాణకు దక్కుతాయన్నారు.

Distribution of pensions to 5 lakh people

Telangana News

Related Stories: