కారుకు 1000 ప్లస్..హస్తానికి1000 మైనస్ లు

తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్వి జయంగా అమలు చేస్తున్న వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాల కారణంగా టిఆర్ ఎస్ పార్టీ వెయ్యి రకాల అనుకూలతలతో దూసుకుపోతున్నది. అలాగే ఆంధ్రా చంద్రబాబు నాయకత్వంలోని కాంగ్రెస్, టీడీపీల మహాకూటమి వెయ్యి రకాల ప్రతికూలతలతో రోజు రోజుకు దిగులు చెడి చాలా చోట్ల డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని దుస్థితికి దిగజారిపోతున్నది. ముందుగా మనం టిఆర్‌ఎస్ అనుకూలతలను ప్రస్తావిం చాలను కుంటే తెలంగాణ రథసారథి కేసీఆర్ ఆ పార్టీకి అత్యంత విలువైన […]

తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్వి జయంగా అమలు చేస్తున్న వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాల కారణంగా టిఆర్ ఎస్ పార్టీ వెయ్యి రకాల అనుకూలతలతో దూసుకుపోతున్నది. అలాగే ఆంధ్రా చంద్రబాబు నాయకత్వంలోని కాంగ్రెస్, టీడీపీల మహాకూటమి వెయ్యి రకాల ప్రతికూలతలతో రోజు రోజుకు దిగులు చెడి చాలా చోట్ల డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని దుస్థితికి దిగజారిపోతున్నది. ముందుగా మనం టిఆర్‌ఎస్ అనుకూలతలను ప్రస్తావిం చాలను కుంటే తెలంగాణ రథసారథి కేసీఆర్ ఆ పార్టీకి అత్యంత విలువైన సంపదగా భావించవచ్చు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం కేసీఆర్‌ను భవిష్యత్ తరాలు గుర్తుంచుకోకుండా ఉండలేవు. తెలంగాణ అని పలకడానికి కూడా ఇష్టపడని సమైక్య పార్టీల చేత, పత్రికల చేత తెలంగాణ గురించి కొన్ని కోట్ల సార్లు మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిని సృష్టించి ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఒప్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహా నాయకుడు కేసీఆర్.
2014లో టిఆర్‌ఎస్ ప్రధాన ఎన్నికల ఆయుధం కేసీఆర్. ఈ ఎన్నికల్లోనూ కేసీఆరే టిఆర్‌ఎస్ బ్రహ్మాస్త్రం అని చెప్పక తప్పదు. టిఆర్‌ఎస్‌కు ఓటు వేద్దామనుకునే వాళ్ళందరూ కేసీఆర్ కోసమే కారు గుర్తుకు ఓటేస్తామని నిర్మొహమాటంగా చెబుతున్నరు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా 2014లో ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. ఈ నాలుగేళ్లలో ఆయన చేపట్టిన వందలాది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ప్రతి మారు మూల పల్లెల్లోని లబ్ధిదారులకు చేరుకున్నయి. గత 60 ఏళ్ల సమైక్య పాలనకు నాలుగేళ్ళ కేసీఆర్ పాలనకు గల తేడాను ప్రజలు కథలుకథలుగా చెప్పుకుంటున్నరు.
ప్రభుత్వ పథ కాల ఫలాలను అనుభవిస్తున్నరు. ఒక్క ఆసరా పథకం కిందే 40 లక్షల మందికి పంచడం కోసం ప్రతి నెల రూ. 4000 కోట్లు పల్లెలకు, పట్టణాలకు వెళుతున్నయంటే ముఖ్య మంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. రైతు బంధు పథకం కింద ప్రతి ఏటా రూ. 12000 కోట్లు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తెలంగాణలో కోటి మూడు లక్షల కుటుం బాలు ఉంటే సుమారు 58 లక్షల మంది రైతులకు, పరోక్షంగా మరో 15 లక్షల మంది కుటుంబాలకు మేలు చేసే సాగు నీటి ప్రాజెక్టుల కోసం మరో రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇట్ల సుమారు 400 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతున్నది. 24 గంటల విద్యుత్తు , శాంతి భద్రతలు సహా ఇంకా కొన్ని వందల పథకాలు విజయవంతంగా అమలవు తున్నవి. ఇవన్నీ తెలంగాణ ప్రజల అనుభవంలో ఉన్న పథకాలు, కార్యక్రమాలే. ముఖ్య మంత్రి కేసీఆర్ తరచుగా ఒక మాట చెబుతుంటరు. సంపదను సృష్టించడం పేదలకు పంచడం ఇదే మా పాలసీ అని. ఇది సహజంగా పూర్వం నిజమైన కమ్యూ నిస్టు ప్రభుత్వాలు చేసిన పని.
ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక రైతుగా, ఒక ఐఎఎస్, ఐపిఎస్ అధికారిగా, ఒక ఆర్థిక వేత్తగా, ఒక రాజనీతి జ్ఞుడిగా, ఒక సీఈఓగా, ఆలోచించి నిర్ణయాలు తీసుకుం టూ పరిపాలన చేయడం మనకు కనిపిస్తుంది. ఇలా ఆయన చేసిన ప్రతి పని గురించి ప్రజలు గొప్పగా చెప్పు కుంటున్న దాఖలాలు మన కు కనపడుతున్నయి. ఆ పనులే ఈ రోజు ఎన్నికల్లో టిఆర్ ఎస్ అభ్యర్థులకు అద్భుతంగా ఉపయోగపడుతున్నయి. అసెంబ్లీ రద్దయిన రోజే టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ఇప్పటికే తమ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వీధి , ప్రతి ఇల్లు తిరిగి ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్ధించారు. టి ఆర్‌ఎస్‌కు ఓటు వేయడమంటే ఒక భరోసాతో ప్రజలు ఫీలయ్యే పరిస్థితి ఉంది.
టిఆర్‌ఎస్ గెలిచి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు ఇక తిరుగు ఉండదనే అభిప్రాయం అత్యధిక శాతం మందిలో కనిపిస్తున్నది. ప్రాజెక్టులు పూర్తవుతాయని, ఇంకా కొత్త సంక్షేమ పథకాలు అమలవుతాయని ప్రజలు విశ్వసిస్తున్నరు. వ్యవసాయ రంగం ప్రాణం పోసుకుంటుందని ప్రజల్లో నమ్మకం ఏర్ప డింది. గ్రామాల్లో కూడా వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగినయి. రేపు నదీ జలాల పంపిణీ సహా అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొట్లాడాలంటే కేసీఆరే సీఎంగా ఉండాలనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలం గా ఉంది. ఇట్లా టిఆర్‌ఎస్‌కు ఎన్నో అనుకూలతలు ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆంధ్రా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్నికల్లో నిలబ డుతున్న కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్, సీపీఐ ల మహాకూ టమికి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నయి.
ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇంకా ఆ పార్టీలు అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించుకోలేని దుస్థితిలో ఉన్నయి. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రా చంద్రబాబు చేతుల్లో పెట్టడమేమిటని తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నరు. చంద్రబాబు డబ్బుల కోసం ఇన్నేళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణను ఆయనకు తాకట్టు పెడుతున్నారని ఇక్కడి కాంగ్రెస్ నాయ కులపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
అభ్యర్థుల టికెట్ల కేటాయింపు గురించే ఇప్పటికే ఎన్నో సార్లు ఆ పార్టీ నాయకులు ఢిల్లీకి, ఆంధ్రా రాజధాని అమరావతికి తిరగాల్సి వచ్చింది. అసలు పోటీ చేసే సీట్లు పంచుకోలేని పార్టీలు ఇక ప్రభుత్వాన్ని ఏం నడుపుతయని ప్రజలు కథలు కథలుగా చర్చించుకుంటున్నరు. వీళ్లకు అధికా రాన్ని అప్పగిస్తే తెలంగాణ పని అయిపోయి నట్లేనని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నరు. మేము కూడా పని చేస్తామని కూటమి నాయకులు ప్రజలోకి వెళ్లి చెబుతుంటే 60 ఏళ్ళు ఏం చేసిండ్రని ప్రజలే నిలదీస్తున్నరు.
ఈ నాలుగేళ్లలో కేసీ ఆర్ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే మళ్లీ తెలంగాణ 30 ఏళ్ళు వెనక్కి పోతుందనే ఆందోళన అత్యధిక శాతం మంది ప్రజల్లో వ్యక్తమవుతున్నది. పరిపాలన బాగా చేస్తామని చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదు. అసలు కూటమిలో కూడా ఓట్ల బదిలీ జరగదనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తున్నది . కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర కూటమి పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఖరారయ్యేది ఎప్పుడు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళేది ఎప్పుడు అని రాజకీయ విశ్లేషకులు ఆశ్చ ర్యం వ్యక్తం చేస్తున్నరు. టిఆర్‌ఎస్‌కు ఎన్ని అనుకూలతలు ఉన్నయో మహాకూటమికి అంతకంటే ఎక్కువ ప్రతికూల తలు ఉండడం ఈ ఎన్నికల్లో ఫలితాలను నిర్దేశించబో తున్నదనే ఒక అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.

KCR  Development plans in Telangana

Telangana News