ఇంగ్లండ్‌కు మరో గెలుపు

సెయింట్ లూసియా: మహిళల ప్రపంచకప్ గ్రూప్‌ఎలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ డిఎల్‌ఎస్ విధానంలో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 76 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేశారు. అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన క్రిస్టి గొర్డాన్ 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు […]

సెయింట్ లూసియా: మహిళల ప్రపంచకప్ గ్రూప్‌ఎలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ డిఎల్‌ఎస్ విధానంలో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 76 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేశారు. అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన క్రిస్టి గొర్డాన్ 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టింది. నటాలె షివర్ 3 ఓవర్లలో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది. అన్యా శుభ్‌సోలే, సోఫిలు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో తమవంతు పాత్ర పోషించారు.

బంగ్లా జట్టులో ఓపెనర్ అయేషా రహ్మాన్ మాత్రమే ఒంటరి పోరాటం చేసింది. సమన్వయం తో బ్యాటింగ్ చేసిన అయేషా రెండు ఫోర్లతో 39 పరుగులు చేసింది. రుమానా (10), జహనారా ఆలమ్ (12) తప్ప మిగతావారు కనీసం రెండంకెలా స్కోరును కూడా అందుకోలేక పోయారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 9.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ అక్కడే ఆగి పోయింది. ఈ పరిస్థితుల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని ప్రకటించారు. మెరుగైన స్థితిలో నిలిచిన ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నటాలె షివర్ 4 ఫోర్లతో వేగంగా 23 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ఎలెన్ జోన్స్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
సఫారీ జట్టు జయకేతనం
శ్రీలంకతో జరిగిన మరో మ్యాచ్‌లో సౌతాఫ్రికా మహిళా జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు మాత్రమే చేసింది. సౌతాఫ్రికా బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. కీలక బౌలర్లు మరిజానె కాప్, షబ్నమ్ ఇస్మాయిల్‌లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి లంక బ్యాట్స్‌విమెన్‌లను కోలుకోనివ్వలేదు. చివర్లో లంక వికెట్ కీపర్ దిలాని మండోరా 12 బంతుల్లో 4 ఫోర్లతో అజేయంగా 20 పరుగులు చేయడంతో లంక ఈ మాత్రమైన స్కోరును సాధించింది. స్టార్ క్రీడాకారిణి సిరివర్దనే (21) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. ప్రత్యర్థి జట్టులో ఇస్మాయిల్ 4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. కాప్ 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.

కెప్టెన్ వాన్ నికర్క్ 3 ఓవర్లలో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు లిజల్లె లి (1), వాల్‌వర్డ్‌ట్ (4) నిరాశ పరిచారు. దీంతో సఫారీ జట్టు ఆరు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇనింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కాప్, కెప్టెన్ నికర్క్ తమపై వేసుకున్నారు. ఇద్దరు లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కాప్ 4 ఫోర్లు, సిక్స్‌తో 38 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన నికర్క్ 33 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. డు ప్రిజ్ 16(నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

England to win over Bangladesh in World Twenty20

Telangana News

Related Stories: