అనంత్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు

బెంగళూరు: ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాల మధ్య మంగళవారం ముగిసాయి. వేలాది మంది ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనంత్ కుమార్ అమర్ రహే నినాదాలిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. స్మార్థ బ్రాహ్మణ ఆచారం ప్రకారం అనంత్‌కుమార్ పెద్ద సోదరుడు నందకుమార్ అంతిమ క్రియలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అనంత్ చితికి  నిప్పంటించారు.  కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్, బిజెపి జాతీయాధ్యక్షుడు […]

బెంగళూరు: ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాల మధ్య మంగళవారం ముగిసాయి. వేలాది మంది ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనంత్ కుమార్ అమర్ రహే నినాదాలిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. స్మార్థ బ్రాహ్మణ ఆచారం ప్రకారం అనంత్‌కుమార్ పెద్ద సోదరుడు నందకుమార్ అంతిమ క్రియలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అనంత్ చితికి  నిప్పంటించారు.  కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, కర్ణాటక భాజపా నేతలు అంత్యక్రియలకు హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు. మంగళవారంనాడు అనంత్‌కుమార్ భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి ఇక్కడి బిజెపి కార్యాలయానికి తీసుకొచ్చారు.

అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనంత్ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం నేషనల్ కళాశాల మైదానానికి తరలించారు. అక్కడి నుంచి అంతిమయాత్ర చేపట్టి చామరాజపేట్ శ్మశానవాటికలో అనంత్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధపడుతున్న అనంత్ కుమార్ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. లండన్, న్యూ యార్క్ వైద్యాలయాల్లో చికిత్స అనంతరం బెంగళూరుకు వచ్చిన ఆయన 20 రోజులుగా ఓ ప్రై వేటు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనంత్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పలువులు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Union Minister Ananth Kumar funeral,

Telangana News

Related Stories: