న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఎదుట మొత్తం 49 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై మంగళవారంనాడు విచారణ జరిపిన కోర్టు వచ్చే ఏడాది జనవరి 22న బహిరంగ కోర్టులో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అయితే పాత తీర్పుపై స్టే ఇవ్వలేమని పేర్కొంది. ‘మేం ఒకటి స్పష్టంగా చెప్పదలచుకున్నాం. ఈ అంశంపై గతంలో ఇదే కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించలేం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
శాస్త్రీయ లేదా హేతువాత కారణాల ఆధారంగా తీర్పు వెలువరించడం సరికాదని, సైకలాజికల్ అంశాల ను పరిగణలోకి తీసుకు ని నిషేధం ఎత్తివేయడం స్వాగతించదగ్గది కాద ని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనాదిగా వస్తున్న ఆచారాలను కూడా లెక్కలోకి తీసుకోవాలని కోరారు. కేరళలోని పవిత్ర శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యు ల ధర్మాసనం 4:1 మెజార్టీతో తీర్పు వెలువరించిన విష యం తెలిసిందే. అయితే ఈ తీర్పు వెలువడిన నాటి నుంచి శబరిమలలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. తీర్పునకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు.
కాగా మాస పూజల నిమిత్తం అక్టోబరు 17న ఆలయాన్ని తెరవగా ఈ పరిస్థితులు మ రింత ఉద్రిక్తంగా మారాయి. కొందరు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించడంతో భక్తులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు సు ప్రీం తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సహా పలువురు రివ్యూ పిటిషన్ను దాఖలు చేశారు. వీటిని అంగీకరించిన న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది.
అయ్యప్పే సాయపడ్డారు : ప్రధాన పూజారి
సుప్రీం కోర్టు తాజా నిర్ణయాన్ని శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు స్వాగతించారు. ‘ఇది గొప్ప నిర్ణయం. సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకునే దిశగా అయప్పే సాయపడ్డారు అని భావిస్తున్నా’ అని ఆలయ ప్రధాన పూజారి రాజీవరు అన్నారు. కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును ఎట్టిపరిస్థితుల్లో అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
హెలికాప్టర్లలో మహిళల తరలింపు?
తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప సన్నిధిలోకి మహిళ ప్రవేశాన్ని ఆందోళనకారులు అడ్డుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పంథాను అనుసరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళల ఆలయ ప్రవేశాన్ని నిరసిస్తున్న వారి దాడుల నుంచి భక్తులను కాపాడేందుకు హెలికాప్టర్ల ద్వారా భక్తులను తరలించాలని అనుకుంటున్నట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. మహిళా భక్తులను తిరువనంతపురం లేదా కోచ్చిలోని విమానాశ్రయాల నుంచి వారిని హెలికాప్టర్ల ద్వారా చేర్చాలని చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఆందోళనకారుల దాడుల నుంచి బయటపడాలంటే ఇది చివరి ప్రయత్నంగా ప్రభుత్వం భావిస్తోంది. శబరిమల ఆలయాన్ని ఈ నెల 17న తిరిగి తెరవనున్నారు. మండలం మకరవిలక్కు నేపథ్యంలో 41రోజుల పాటు ఆలయం తెరుచుకోనుంది. సుమారు 560మంది మహిళలు అయ్యప్ప దర్శనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికులు 10 నుంచి 50సంవత్సరాల మధ్య వయస్కులే ఉన్నట్లు ఆలయం వర్గాలు వెల్లడించాయి.