ఓయూకి మొండిచెయ్యి

మన తెలంగాణ/ఉస్మానియాయూనివర్సిటీ : ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు టిక్కెట్లు ఇవ్వకుండా మహాకూటమి పార్టీలు మొండి చెయ్యి చూపాయి. గత నాలుగేళ్ళుగా కాంగ్రెస్, టిడిపి, జనసమితి పార్టీలను నమ్ముకుని తాము ఎంతో శ్రమిం చి ఉద్యమాలు చేసినా… చివరకు టిక్కెట్ దక్కకపోవడంతో విద్యార్థి నాయకుల ఆశలు ఆవిరైపోయాయి. తొలిజాబితాలో కాంగ్రెస్ 65 టిక్కెట్లు, టిడిపి 9 టిక్కెట్లను ఖరారు చేయగా అందులో ఓయూ నుం చి ఒక్క విద్యార్థికి కూడా టిక్కెట్ దక్కలేదు. టిక్కెట్ ఆశించిన […]

మన తెలంగాణ/ఉస్మానియాయూనివర్సిటీ : ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు టిక్కెట్లు ఇవ్వకుండా మహాకూటమి పార్టీలు మొండి చెయ్యి చూపాయి. గత నాలుగేళ్ళుగా కాంగ్రెస్, టిడిపి, జనసమితి పార్టీలను నమ్ముకుని తాము ఎంతో శ్రమిం చి ఉద్యమాలు చేసినా… చివరకు టిక్కెట్ దక్కకపోవడంతో విద్యార్థి నాయకుల ఆశలు ఆవిరైపోయాయి. తొలిజాబితాలో కాంగ్రెస్ 65 టిక్కెట్లు, టిడిపి 9 టిక్కెట్లను ఖరారు చేయగా అందులో ఓయూ నుం చి ఒక్క విద్యార్థికి కూడా టిక్కెట్ దక్కలేదు. టిక్కెట్ ఆశించిన విద్యార్థి నాయకులే కాకుండా సాధారణ విద్యార్థులు సైతం ఈ అంశంపై చర్చిస్తూ మహాకూటమి పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనీసం టిఆర్‌ఎస్ పార్టీని చూసైనా మహాకూటమి పార్టీల నాయకులు బుద్ది తెచ్చుకుని ఉంటే బాగుండేదని ఓయూ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో వివిధ స్థాయి లో సేవలందించి ఓయూ పరిశోధక విద్యార్థిగా ఉన్న కోటూరి మానవతారాయ్ ఆ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. బహిరంగంగానే తనకు టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీనాయకుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను గుర్తించి కంటోన్మెంట్ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, పరోక్షంగా బిజెపి నాయకులకు సంకేతాలిస్తున్నారు. తెలంగా ణ విద్యార్థి, నిరుద్యోగ జెఏసి చైర్మన్‌గా నిరంతరం పోరాటాలు చే స్తూ ఓయూ విద్యార్థుల మనస్సులో బలంగా నాటుకున్న కోటూరి మానవతారాయ్‌కు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ఈసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ వస్తుందని విద్యార్థులు బలంగా విశ్వసించారు.

సత్తుపల్లి నియోజకవర్గం టిడిపికి పోయినప్పటికీ.. స్టేషన్‌ఘన్‌పూర్ లేదా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోటి నుంచి రాయ్‌కు టిక్కెట్ వస్తుందని విద్యార్థులు ఆశించారు. కాగా కంటోన్మెంట్ సర్వే సత్యనారాయణకు, స్టేషన్‌ఘన్‌పూర్ ఇందిరకు కేటాయించడంతో ఇక మానవతారాయ్‌కు టికెట్ రాదని తేలిపోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన మానవతారాయ్ డిగ్రీ చదువుతు న్న రోజుల నుంచే కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐలో చురుకైన కార్యకర్త. అలాగే ఓయూలో గత 16 సంవత్సరాలుగా ఉంటూ పిజి, ఎల్‌ఎల్‌బి కోర్సులు పూర్తి చేసి ప్రస్తుతం తెలు గు శాఖలో పరిశోధక విద్యార్థిగా ఉన్న రాయ్ ఓయూలో కూడా ఎన్‌ఎస్‌యూఐ నాయకునిగా కీలకంగా పనిచేశారు.

అలాగే మలిదశ తె లంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థి జెఏసిలో పనిచేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జెఏసి ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌గా ఉంటూ అనేక ఆందోళన కార్యక్రమాలు ఓయూ కేంద్రంగా చేపట్టారు. ప్రస్తుతం టిపిసిసి కార్యదర్శి గా, కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటి మెంబర్‌గా కూడా ఉన్నా రు. ఇంతటి బయోడేటా ఉన్న వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీపై రాయ్ అనుచరులు, అభిమానులు ఆ గ్రహంతో ఊగిపోతున్నారు. ఇక ఓయూ విద్యార్థి జెఏసి నాయకులు గా ఉన్న దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్, బాలలక్ష్మిలకు టిక్కెట్ రాకపోవడంతో తీవ్ర ఆందోళనతో ఉన్నారు. వీరు కూడా నేడో..రేపో త మ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే భువనగిరి నుంచి ఓయూ పరిశోధక విద్యార్థిని తడ్క కల్పన (టిపిసిసి కార్యదర్శి) టిక్కెట్ ఆశించారు.

ఈ నియోజకవర్గంలో అత్యధికంగా పద్మశాలి ఓట్లు కలిగి ఉండటంతో తనకే టిక్కెట్ వస్తుందని ఆ శిస్తూ గత కొంతకాలంగా కాంగ్రెస్‌లో చురుగ్గా పనిచేస్తున్నారు. అ యినప్పటికీ అక్కడ రెడ్డి కులానికి చెందిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికే కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొల్లాపూర్ నుంచి ఓయూ విద్యార్థి కేతూరి వెంకటేష్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించగా అతనికి టిక్కెట్ దక్కలే దు. మునుగోడు నుంచి ఓయూ విద్యార్థి జెఏసి మాజీ నాయకుడు పున్న కైలాస్ నేత ఆశించగా అక్కడ మాజీ ఎం పి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టిక్కెట్ దక్కింది. అలాగే కంటోన్మెంట్ నుంచి ఓయూ రీసెర్చ్‌స్కాలర్ మన్నె క్రిషాంక్ ఆశించగా అక్కడ మాజీ ఎంపి సర్వే సత్యనారాయణకు టిక్కెట్ వరించింది.
– టిడిపిలోనూ ఓయూకు దక్కని టిక్కెట్లు !
గత ఎన్నికల్లో ఓయూ నుంచి ఇద్దరు విద్యార్థులకు టిడిపి టిక్కెట్లు దక్కినప్పటికీ … ఈసారి ఒక్క ఓయూ విద్యార్థికి కూడా టిడిపి టిక్కెట్ దక్కలేదు. ఓయూ విద్యార్థి జెఏసి నాయకునిగా, తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకునిగా ఉన్న పుల్లారావు యాదవ్ ఖమ్మం నియోజకవర్గ టిక్కెట్‌ను ఆశించారు. కాగా అక్కడ మాజీ ఎంపి నామా నాగేశ్వర్‌రావుకు టిక్కెట్‌ను ప్రకటించారు. ఇకపోతే ఓయూలోని బిసి కులానికి చెందిన ప్రొఫెసర్ కూడా టిడిపి టిక్కెట్ ఆశించారు. అయితే ఆ ప్రొఫెసర్‌కు టిక్కెట్ దక్కలేదు. గతంలో ఓయూ ప్రొఫెసర్‌ను రాజ్యసభ సభ్యునిగా చేయడంతోపాటు ఢిల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేసే అవకాశం కల్పించిన చరిత్ర టిడిపికి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక ఎమ్మెల్యే టిక్కెట్ ఈసారి ఓయూ బిసి ప్రొఫెసర్‌కు ఇస్తారని ఆశించినప్పటికీ .. టిడిపి టిక్కెట్ ఇవ్వలేదు.
– టిజెఎస్‌లో విద్యార్థులకు టిక్కెట్లు లేనట్టే…!
గత నాలుగేళ్ళుగా విద్యార్థులను వాడుకున్న తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ విద్యార్థుల టిక్కెట్ల గురించి పట్టించుకోవడంలేదని బాహాటంగా ఓయూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. టిజెఎస్ టిక్కెట్లలో రెండు లేకుంటే ఒక్క టిక్కెటైనా ఓయూ విద్యార్థికి వస్తుందని ఎంతో మంది ఆశించారు. జహీరాబాద్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి టిక్కెట్ ఆశించిన ఓయూ పరిశోధక విద్యార్థి ఆశప్పకు కాకుండా అక్కడ కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డికి లభించింది. ఇక ఎల్లారెడ్డి నుంచి నిజ్జెన రమేశ్ ముదిరాజ్, జడ్చర్ల నుంచి కల్వకుర్తి ఆంజనేయులు, చెన్నూరు నుంచి మందాల భాస్కర్‌లు టిక్కెట్ ఆశించినప్పటికీ టిక్కెట్లు వారికి రావడంలేదు. తెలంగాణ జనసమితి నుంచి కూడా విద్యార్థులకు టిక్కెట్లు ఎందుకు రావడంలేదనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Station Ghanpur Assembly constituency Ticket

Related Stories: