’జిమ్మికి కమల్‘ పాట‌తో జ్యోతిక‌-మంచు ల‌క్ష్మీ సందడి

చెన్నై: ప్రముఖ హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రలో తమిళంలో నటించిన చిత్రం ‘కాట్రిన్‌ మొళి’. ఈ చిత్రాన్ని హిందీలో విజయం సాధించిన ‘తుమ్హారి సులు’ అనే సినిమాకు తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో జ్యోతిక లేట్‌ నైట్‌ ఆర్జే పాత్రలో సందడి చేయనున్నారు. కాగా, ఎఫ్ ఎమ్ స్టేషన్ హెడ్‌గా మంచు లక్ష్మి నటించగా…తమిళ హీరో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాధామోహన్‌ దర్శకత్వం వహించారు. ధనుంజేయన్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఎ.హెచ్‌ కాశిఫ్‌ సంగీతం అందించారు. నవంబరు […]

చెన్నై: ప్రముఖ హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రలో తమిళంలో నటించిన చిత్రం ‘కాట్రిన్‌ మొళి’. ఈ చిత్రాన్ని హిందీలో విజయం సాధించిన ‘తుమ్హారి సులు’ అనే సినిమాకు తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో జ్యోతిక లేట్‌ నైట్‌ ఆర్జే పాత్రలో సందడి చేయనున్నారు. కాగా, ఎఫ్ ఎమ్ స్టేషన్ హెడ్‌గా మంచు లక్ష్మి నటించగా…తమిళ హీరో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాధామోహన్‌ దర్శకత్వం వహించారు. ధనుంజేయన్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఎ.హెచ్‌ కాశిఫ్‌ సంగీతం అందించారు. నవంబరు 16న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘జిమ్మికి కమల్’ అనే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. గ‌త ఏడాది మోహన్‌ లాల్‌ హీరోగా తెరకెక్కిన ‘వెలిపడింతే పుస్తకమ్‌’ సినిమాలోని జిమ్మికి కమల్ సాంగ్ యూత్‌ని బాగా ఊపేసిన సంగతి తెలిసిందే. మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన జిమ్మికి కమల్ పాట‌ని ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఈ పాటకు జ్యోతిక, మంచు లక్ష్మి కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తుంది. ఏకంగా 1 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి వైరల్ అయ్యింది. మరి ఆ సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.
Jyotika & lakshmi manchu dances to jimikki kammal song

Telangana News

Related Stories: