నేను నిజమే చెప్పాను…

పారిస్ : రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంతో తాను అబద్ధాలు చెప్పినట్లు రాహుల్ గాంధీ తనపై చేసిన ఆరోపణలపై దసాల్ట్ ఏవియేషన్ సిఈఓ ఎరిక్  ట్రాపియర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ వివాదాస్పద ఒప్పందంలో  ప్రధాని నరేంద్ర మోడీని కాపాడేందుకు తాను అబద్ధాలు చెప్పినట్లు రాహుల్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ‘నేను అబద్ధాలు చెప్పను. నేను ఇంతకు ముందు చెప్పినవన్నీ నిజాలే. ఒక సిఈఓ స్థానంలో ఉండి అబద్ధాలు చెప్పడం సాధ్యమా? అబద్ధాలు చెప్పినందుకు నాకేమైనా […]

పారిస్ : రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంతో తాను అబద్ధాలు చెప్పినట్లు రాహుల్ గాంధీ తనపై చేసిన ఆరోపణలపై దసాల్ట్ ఏవియేషన్ సిఈఓ ఎరిక్  ట్రాపియర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ వివాదాస్పద ఒప్పందంలో  ప్రధాని నరేంద్ర మోడీని కాపాడేందుకు తాను అబద్ధాలు చెప్పినట్లు రాహుల్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ‘నేను అబద్ధాలు చెప్పను. నేను ఇంతకు ముందు చెప్పినవన్నీ నిజాలే. ఒక సిఈఓ స్థానంలో ఉండి అబద్ధాలు చెప్పడం సాధ్యమా? అబద్ధాలు చెప్పినందుకు నాకేమైనా జీతం ఇస్తారా?’ అని ట్రాపియర్ ప్రశ్నించారు. రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను  ఆఫ్‌సెట్ భాగస్వామిగా ఎంచుకోవడంపైనా, రాఫెల్ విమానాలకు మోడీ ప్రభుత్వం అధిక ధరను చెల్లిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోణలపైనా ఆయన స్పందించారు.

రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవడంలో తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశారు. రిలయన్స్‌కు నేరుగా నిధులు ఇవ్వలేదని, జాయింట్‌వెంచర్‌లో భాగంగానే ఇచ్చామని చెప్పారు. అయితే ఇది దసాల్ట్ పెట్టుబడి కాదని, అనిల్ అంబానీకి ఇచ్చిన ముడుపులని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే ‘ రిలయన్స్ డిఫెన్స్ విలువ కేవలం రూ. 8 లక్షలు. ఆ కంపెనీ పూర్తి నష్టాల్లో ఉంది. అలాంటి నష్టదాయక కంపెనీలో దసాల్ట్ రూ. 284 కోట్లు ఇచ్చి వాటా కొనుగోలు చేసింది. దీని వెనుక మతలబు ఏమిటి?’ అని ఈ నెల 2న విలేఖరుల సమావేశంలో రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా తమ సంస్థకు 1953నుంచే భారత్‌తో అనుబంధం ఉందని, నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలోనే తొలి ఒప్పందం కుదిరిందని ట్రాపియర్ గుర్తు చేశారు.

‘ కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం పని చేసిన అనుభవం మాకు ఉంది. 1953లో నెహ్రూతో తొలి ఒప్పందం చేసుకున్నప్పటినుంచి పలువురు భారత ప్రధానులతో కలిసి పని చేశాం. అయితే మేము భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం తప్ప ఏ పార్టీతోను పని చేస్తున్నట్లు భావించలేదు. భారత వైమానిక దళం(ఐఎఎఫ్)కు యుద్ధ విమానాలతో పాటుగా భారత ప్రభుత్వానికి  పలు వ్యూహాత్మక ఉత్పత్తులను సరఫరా చేశాం. ఇది అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం..’ అని ట్రాపియర్ స్పష్టం చేశారు.

అసలు బొమ్మ ముందుంది మిత్రమా.. 

న్యూఢిల్లీ: వివాదాస్పద రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒపందంలో తాను దొంగనేనని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సుప్రీంకోర్టు ముందు అంగీకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత వైమానిక దళం(ఐఎఎఫ్)తో సంప్రదింపులు జరపకుండానే యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో మార్పులు చేసినట్లు స్పష్టమయిందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాఫెల్ ఒప్పందం సందర్భంగా జరిగిన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం  సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘మోడీ తాను దొంగనని స్వయంగా సుప్రీంకోర్టులో అంగీకరించారు. వైమానిక దళాన్ని సంప్రదించకుండానే ఒప్పందంలో మార్పులు చేసినట్లు.. రూ.30 వేల కోట్లు అనిల్ అంబానీ జేబులో వేసినట్లు తన అఫిడవిట్‌లో అంగీకరించారు. అసలు బొమ్మ ముందుంది మిత్రమా..’ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ద్వారా రాఫెల్ ఒప్పందంలో  మరిన్ని ‘తప్పిదాలు’ బయటికొచ్చాయంటే మీడియాలో వచ్చిన ఒ కథనాన్ని కూడా ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.

Rahul Gandhi Speech Attacking PM Modi Over Rafale Deal

Telangana News

Related Stories: