అక్షత్ డబుల్ ధమాకా

మన తెలంగాణ/హైదరాబాద్: కెప్టెన్ అక్షత్ రెడ్డి 248(నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ రౌండ్2 మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసింది. ఒకవైపు అక్షత్, మరోవైపు బవనకా సందీప్ రాణించడంతో హైదరాబాద్ భారీ స్కోరును సాధించింది. మంగళవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి అక్షత్ రెడ్డి 477 బంతుల్లో 22 ఫోర్లు, రెండు సిక్సర్లతో 248 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అసాధారణ బ్యాటింగ్‌ను […]

మన తెలంగాణ/హైదరాబాద్: కెప్టెన్ అక్షత్ రెడ్డి 248(నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ రౌండ్2 మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసింది. ఒకవైపు అక్షత్, మరోవైపు బవనకా సందీప్ రాణించడంతో హైదరాబాద్ భారీ స్కోరును సాధించింది. మంగళవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి అక్షత్ రెడ్డి 477 బంతుల్లో 22 ఫోర్లు, రెండు సిక్సర్లతో 248 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన అక్షత్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అక్షత్ ఔట్ చేసేందుకు తమిళ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షత్ హైదరాబాద్‌ను సురక్షిత స్థానంలో నిలిపాడు. మరోవైపు సందీప్ 221 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో 130 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. సాకేత్ సాయిరాం 4 ఫోర్లతో 42 పరుగులు చేసి అక్షత్‌కు అండగా నిలిచాడు.
కేరళ దీటైన జవాబు..
తిరువనంతపురం వేదికగా ఆంధ్రాతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఆతిథ్య కేరళ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 227 పరుగులు చేసింది. ఆంధ్రా తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులకే కుప్పకూలింది. రికి బుయ్ (109) సెంచరీతో ఆంధ్రాను ఆదుకున్నాడు. వికెట్ కీపర్ శివచరణ్ సింగ్ (45) తప్ప మిగతావారు విఫలం కావడంతో ఆంధ్రా ఇన్నింగ్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. కేరళ జట్టులో కెసి.అక్షయ్ నాలుగు, బాసిల్ థంపి మూడు, సందీప్ రెండు వికెట్లు తీశారు. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన కేరళ మంగళవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్లు అరుణ్ కార్తీక్, జలజ్ సక్సెనాలు కేరళకు శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. అరుణ్ కార్తీక్ 8 ఫోర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు.

మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన జలజ్ సక్సెనా 217 బంతుల్లో 11 ఫోర్లతో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రోహన్ ప్రేమ్ 34(బ్యాటింగ్) అతనికి అండగా ఉన్నాడు. మరోవైపు ఆంధ్రా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే కేరళ మరో 27 పరుగులు మాత్రమే చేయాలి. ఇప్పటికే 9 వికెట్లు చేతిలో ఉండడంతో కేరళకు భారీ ఆధిక్యం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

Akshath Reddy double ton puts Hyderabad in command

Telangana News

Related Stories: