కేంద్ర మంత్రివర్గంలో స్వల్ప మార్పులు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనంతకుమార్‌ కన్నుమూయడంతో కేంద్ర మంత్రి వర్గంలో స్వల్ప మార్పులు చోటుచేసుకొన్నాయి.  ఆయన నిర్వహించిన 2 శాఖలను మరో ఇద్దరు మంత్రులకు అదనంగా కేటాయించారు. కేంద్ర మంత్రి సదానందగౌడకు అదనంగా ఎరువులు, రసాయనాలశాఖను అప్పగించారు. మరో మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వర్గం అనంతకుమార్ మృతిపట్ల సంతాపం తెలిపింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ అంత్యక్రియలు […]

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనంతకుమార్‌ కన్నుమూయడంతో కేంద్ర మంత్రి వర్గంలో స్వల్ప మార్పులు చోటుచేసుకొన్నాయి.  ఆయన నిర్వహించిన 2 శాఖలను మరో ఇద్దరు మంత్రులకు అదనంగా కేటాయించారు. కేంద్ర మంత్రి సదానందగౌడకు అదనంగా ఎరువులు, రసాయనాలశాఖను అప్పగించారు. మరో మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వర్గం అనంతకుమార్ మృతిపట్ల సంతాపం తెలిపింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ అంత్యక్రియలు మంగళవారం అధికారిక లాంఛనాల మధ్య  పూర్తయ్యాయి.

Small changes in the Union Cabinet

Related Stories: