త్వరలో వివో జడ్1 లైట్‌ స్మార్ట్‌ఫోన్ విడుదల

ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్1 లైట్‌ను త్వరలో మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.11,470 ధరకు లభించనుంది. ఈ నూతన స్మార్ట్‌ఫోన్ లో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేతోపాటు ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. 16, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఉన్నాయి. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్ లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను […]

ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్1 లైట్‌ను త్వరలో మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.11,470 ధరకు లభించనుంది. ఈ నూతన స్మార్ట్‌ఫోన్ లో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేతోపాటు ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. 16, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఉన్నాయి. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్ లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు.

ఫీచర్స్ :

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 626 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 4 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జి వివోఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్ లో ఉన్నాయి.

Vivo Z1 Lite Smartphone releases soon