డిసెంబరు 4న నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసు వాచారణ

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి 2011-12లో వేసిన ఆదాయపన్ను అంచనాల కేసును తిరిగి ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ సోనియా, రాహుల్‌ గాంధీ, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌లు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించిం ది. సోనియా, రాహుల్‌ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు,మాజీ కేంద్ర మంత్రులు పి.చిదంబరం, కపిల్ సిబల్ కోర్టులో హాజరయ్యారు. కేవలం షేర్ల బదిలీని ఆదాయంగా పరిగణించలేమని వారు కోర్టులో వాదించారు. ఈ కేసుకు సంబంధించి ఆదాయపన్ను శాఖకు నోటీసులు జారీ చేయాలని సోనియా, రాహుల్‌ల కౌన్సిల్‌ […]

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి 2011-12లో వేసిన ఆదాయపన్ను అంచనాల కేసును తిరిగి ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ సోనియా, రాహుల్‌ గాంధీ, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌లు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించిం ది. సోనియా, రాహుల్‌ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు,మాజీ కేంద్ర మంత్రులు పి.చిదంబరం, కపిల్ సిబల్ కోర్టులో హాజరయ్యారు. కేవలం షేర్ల బదిలీని ఆదాయంగా పరిగణించలేమని వారు కోర్టులో వాదించారు.

ఈ కేసుకు సంబంధించి ఆదాయపన్ను శాఖకు నోటీసులు జారీ చేయాలని సోనియా, రాహుల్‌ల కౌన్సిల్‌ కోరింది. అయితే ఆదాయపన్ను శాఖ తరఫున వాదించిన సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాత్రం నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. కోర్టు తదుపరి విచారణను డిసెంబరు 4వ తేదీ వరకు వాయిదా వేసింది.ఆ రోజే రాహుల్‌, సోనియాలకు ఆదాయపన్ను శాఖ జారీ చేసిన నోటీసులు చెల్లుతాయో లేదో నిర్ణయిస్తామని పేర్కొంది.

National Herald Magazine case trial on December 4

Related Stories: