ధర్నా చౌక్‌ను కొనసాగించండి : హైకోర్టు

హైదరాబాద్ : నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను కొనసాగించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్నా చౌక్ వల్ల శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుండడం వల్ల ఎత్తివేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ధర్నా చౌక్‌ను కొనసాగించాల్సిందేనని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధర్నా చౌక్ ఎత్తివేతపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. […]

హైదరాబాద్ : నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను కొనసాగించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్నా చౌక్ వల్ల శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుండడం వల్ల ఎత్తివేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ధర్నా చౌక్‌ను కొనసాగించాల్సిందేనని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధర్నా చౌక్ ఎత్తివేతపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో సమస్యలపై పోరాటం చేసే హక్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛను నియంత్రించాలే కాని, పూర్తిగా అణిచివేయడం సరి కాదని ఈ సందర్భంగా కోర్టు తేల్చి చెప్పింది.

High Court Warns Telangana Govt Over Dharna Chowk Shifting

Related Stories: