టిడిపి జాబితా

11 స్థానాల్లో టిడిపి అభ్యర్థులు ఖరారు! స్వతంత్రంగా పోటీకి సిద్ధమంటున్న బొల్లం మల్లయ్య యాదవ్ ఆలేరులో నామినేషన్‌కు సిద్ధమైన బండ్రు శోభారాణి  మన తెలంగాణ/హైదరాబాద్: కూటమి పొత్తులో భాగంగా తెలంగాణ తెలుగుదేశంకు దక్కిన పద్నాలుగు స్థానాల్లో పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను ఖరారుచేసింది. ఇదే విషయాన్ని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ సోమవారం ఎన్‌టిఆర్ భవన్‌లో వెల్లడించారు. కానీ ఆ స్థానాల పేర్లనుగానీ, వాటిలో పోటీచేసే అభ్యర్థుల పేర్లను గానీ వెల్లడించడానికి […]

11 స్థానాల్లో టిడిపి అభ్యర్థులు ఖరారు!
స్వతంత్రంగా పోటీకి సిద్ధమంటున్న బొల్లం మల్లయ్య యాదవ్
ఆలేరులో నామినేషన్‌కు సిద్ధమైన బండ్రు శోభారాణి 

మన తెలంగాణ/హైదరాబాద్: కూటమి పొత్తులో భాగంగా తెలంగాణ తెలుగుదేశంకు దక్కిన పద్నాలుగు స్థానాల్లో పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థులను ఖరారుచేసింది. ఇదే విషయాన్ని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ సోమవారం ఎన్‌టిఆర్ భవన్‌లో వెల్లడించారు. కానీ ఆ స్థానాల పేర్లనుగానీ, వాటిలో పోటీచేసే అభ్యర్థుల పేర్లను గానీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. అధికారికంగా జాబితాను మంగళవారం వెల్లడించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. నల్లగొండ, మెదక్, హైదరాబాద్‌లో కొన్ని స్థానా లు, నిజామాబాద్‌లో ఒక స్థానంపై ఇంకా స్పష్టత రాలేదని వివరించారు. 11 స్థానాల్లో పోటీలో ఉండే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే ఖమ్మం నియోజకవర్గంలో నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావు పేట నుంచి మచ్చ నాగేశ్వరరావు, వరంగల్ పశ్చిమ లేదా దక్షిణ- నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, మక్తల్ నుంచి -కొత్తకోట దయాకర్ రెడ్డి, ఉప్పల్ నుంచి- వీరేందర్ గౌడ్, శేరిలింగంపల్లి- నుంచి మువ్వ సత్యనారాయణ, కూకట్‌పల్లి నుంచి మంధారి శ్రీనివాస్‌రావు లేదా పెద్దిరెడ్డి, ఖైరాతాబాద్ నుంచి బి.ఎన్.రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి మండవ వెంకటేశ్వరరావుల పేర్లను టిడిపి ఖరారు చేసినట్లు సమాచారం.

అయితే అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే వరకు ఇప్పుడు లీకైన పేర్ల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కూటమి నేతలంతా కలిసి ఒకే వేదికపై అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇక కూటమిలో భాగంగా తొలి నుంచీ కోదాడ టికెట్ టిడిపికే వస్తుందని ఆ పార్టీ నేతలతో పాటు ఆ స్థానం నుంచి పోటీలో ఉండేందుకు సిద్ధమైన బొల్లం మల్లయ్య యాదవ్ ఆశించారు. అయితే సిట్టింగ్‌లలో భాగంగా దానిని కాంగ్రెస్‌కు కేటాయించ డంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రెబల్‌గా పోటీలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీలో దిగిన పద్మావతికి గట్టి పోటీ ఇచ్చానని, ఈసారి తప్పకుండా విజయం సాధిస్తానని మీడియాతో వ్యాఖ్యానించారు. మహాకూటమిలో భాగంగా టిడిపి తరపున ఆలేరు టికెట్‌ను తనకే కేటాయించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి డిమాండ్ చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు కేటాయించొద్దని ఆమె టిడిపి అధినాయతక్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అందరూ పార్టీ వీడిపోయినా తాను పార్టీ కోసం పనిచేశానని కాంగ్రెస్ సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె ‘మన తెలంగాణ’తో అన్నారు. గత ఎన్నికల్లో ఆలేరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బూడిద భిక్షమయ్య గౌడ్ 35 వేల ఓట్లతో ఓడిపోయారని, దాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ఎలా భావిస్తుందని ప్రశ్నించారు. కురుమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఈ నియోజకవర్గంలో సుమారు 45 వేల పైచిలుకు ఉన్నారని, అక్కడ టిఆర్‌ఎస్ నుంచి మహిళ అభ్యర్థి బరిలో ఉన్నందున సీటును తనకే కేటాయిస్తేనే గెలుపు సాధ్యమవుతుందన్నారు. పార్టీ నుంచి టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నానని, అందులో భాగంగానే రెండు రోజుల్లో నామినేషన్ వేయనున్నట్లు ఆమె తెలిపారు.

TDP Candidates Almost Finalized for 11 Seats

Telangana Latest News

Related Stories: