టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్మిగా సుధీర్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ :మేడ్చల్ మాజీ ఎంఎల్‌ఎ మలిపెద్ది సుధీర్‌రెడ్డిని టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో మేడ్చల్ స్థానానికి సుధీర్‌రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యదర్శి పదవిని అప్పగించడం గమనార్హం. తొలి జాబితాలో 105 మందిని, ఆ తర్వాత రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మరో పన్నెండు స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న పన్నెండు స్థానాల్లో మేడ్చల్ కూడా ఒకటి. […]

మన తెలంగాణ/హైదరాబాద్ :మేడ్చల్ మాజీ ఎంఎల్‌ఎ మలిపెద్ది సుధీర్‌రెడ్డిని టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో మేడ్చల్ స్థానానికి సుధీర్‌రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీ కార్యదర్శి పదవిని అప్పగించడం గమనార్హం. తొలి జాబితాలో 105 మందిని, ఆ తర్వాత రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మరో పన్నెండు స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న పన్నెండు స్థానాల్లో మేడ్చల్ కూడా ఒకటి. నాలుగైదు రోజుల్లో తుది జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈలోపునే సుధీర్‌రెడ్డిని పార్టీ కార్యదర్శిగా నియమించడంతో మేడ్చల్ స్థానాన్ని మరో అభ్యర్థికి కేటాయించే అవకాశముందన్న సంకేతాలిచ్చినట్లయింది.

ఇల్లందు ఇంఛార్జ్‌గా వెంకట్‌గౌడ్
ఇల్లందు శాసనసభ నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్‌గా మడత వెంకట్‌గౌడ్‌ను, పార్టీ పరిశీలకునిగా టి.మధుసూదన్‌ను నియమించినట్లు టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు.

General Secretary of TRS party announced sudheer reddy

Telangana Latest News

Related Stories: