మొండి బకాయిలపై దృష్టి

ఒన్ టైం సెటిల్‌మెంట్‌తో దారి కొస్తున్న కంపెనీలు దేనాబ్యాంక్ ఎండి, సిఇఒ కె.శేఖర్ మనతెలంగాణ/హైదరాబాద్ : దేనాబ్యాంకు, విజయబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలు పెద్ద బ్యాంకుగా అవతరించబోతున్నాయని దేనాబ్యాంక్ ఎండి, సిఈఓ కె.శేఖర్ పేర్కొన్నారు. సోమవారం మెర్కరీ హోటల్‌లో ఏపి, తెలంగాణ దేనాబ్యాంక్ బ్రాంచీల మేనేజర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో మొండి బకాయిలపై దృష్టి సారిస్తామన్నారు. అక్టోబర్ కన్నా నవంబర్‌లో మొండి బకాయిలు వసూలు అవుతున్నాయని డిసెంబర్ 2018, […]

ఒన్ టైం సెటిల్‌మెంట్‌తో దారి కొస్తున్న కంపెనీలు
దేనాబ్యాంక్ ఎండి, సిఇఒ కె.శేఖర్

మనతెలంగాణ/హైదరాబాద్ : దేనాబ్యాంకు, విజయబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలు పెద్ద బ్యాంకుగా అవతరించబోతున్నాయని దేనాబ్యాంక్ ఎండి, సిఈఓ కె.శేఖర్ పేర్కొన్నారు. సోమవారం మెర్కరీ హోటల్‌లో ఏపి, తెలంగాణ దేనాబ్యాంక్ బ్రాంచీల మేనేజర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో మొండి బకాయిలపై దృష్టి సారిస్తామన్నారు. అక్టోబర్ కన్నా నవంబర్‌లో మొండి బకాయిలు వసూలు అవుతున్నాయని డిసెంబర్ 2018, మార్చి 2019 ఆర్థిక సంవత్సరం వరకు తాము అనుకున్న విధంగా బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద కంపెనీలు చాలా వరకు మొండి బకాయిలు చెల్లించడం లేదని వాటిపైనే తాము దృష్టి సారించామన్నారు. 4 రకాల పద్ధతుల్లో తాము బకాయిలను వసూలు చేయాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. 20 శాతంగా ఉన్న బకాయిలను రెండు నెలల్లో 15 శాతానికి తగ్గించడానికి కృషి చేస్తున్నామన్నారు.

షేర్ హోల్డర్లకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా తాము చర్యలు చేపట్టామని, ఆర్‌బిఐ నిబంధనలకు అనుగుణంగా అన్ని జరుగుతున్నాయన్నారు. సెప్టెంబర్ 21వ తేదీ 2018లో దేనాబ్యాంక్ ఎండి, సిఈఓగా తాను బాధ్యతలు చేపట్టానని అప్పటినుంచి బకాయిలపై దృష్టి సారించామని శేఖర్ పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో మొండి బకాయిలను వసూలు చేయడంపైనే తాము దృష్టి సారించామన్నారు. ఎన్‌పిఎస్‌ను తగ్గించాలన్న ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి తమ సిబ్బంది కూడా సహకారం అందిస్తున్నారన్నారు. ఎన్‌పిఏ లెవల్స్ మార్చి 2019 వరకు రూ.9,999 కోట్లకు తగ్గుతుందన్నారు. సౌత్‌లో తమ బ్రాంచీలు తక్కువగా ఉన్నాయని ఏపి, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తమకు 54 బ్రాంచీలు ఉన్నాయన్నారు. కార్పొరేట్‌కు సంబంధించి మొండి బకాయిల విషయంలో ఒన్‌టైం సెటిల్‌మెంట్‌తో పాటు పలు పద్ధతులను ఉపయోగిస్తున్నామన్నారు. బిజినెస్ పెంపులో భాగంగానే ఈ మూడు బ్యాంకుల విలీనం జరుగుతుందన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎస్‌బీఐ తరువాత తమదే అతిపెద్ద బ్యాంకు అవుతుందన్నారు. ఈ మూడు బ్యాంకుల విలీనానికి సంబంధించి ఆర్‌బిఐ గైడ్‌లైన్స్ ప్రకారమే జరుగుతున్నాయన్నారు. దీనికి సంబంధించిన పేరును కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ బ్యాంకు నుంచి లోన్‌లను ఇవ్వడం లేదని కొత్త బ్యాంకుగా అవత రించిన తరువాత వాటిపై దృష్టి సారిస్తామన్నారు. ఈ సమావేశంలో జోనల్ మేనేజర్ పి.శ్రీనివాస్‌తో పాటు పలువురు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

Kesekar meet with Telangana dena bank Branch managers

Telangana Latest News

Related Stories: