వారణాసిలో గంగపై టెర్మినల్

వారణాసి : తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ 2,413 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 2019లో లోక్‌సభ ఎన్నికలు రానున్న తరుణంలో  ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోడీ, గత ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని మండిపడ్డారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలో  ప్రకృతి  సంగమం , సంస్కృతి,  సాహసం ఉన్నాయని,  కొత్త రూపమైన వారణాసిని పరిరక్షించుకోవాలని కోరారు. ఈరోజు చరిత్రాత్మకమైన రోజు.  వారణాసి, దేశం మొత్తంగా ఎంతో అభివృద్ధిని చూస్తోందని, ఇటువంటి […]

వారణాసి : తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ 2,413 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 2019లో లోక్‌సభ ఎన్నికలు రానున్న తరుణంలో  ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోడీ, గత ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని మండిపడ్డారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలో  ప్రకృతి  సంగమం , సంస్కృతి,  సాహసం ఉన్నాయని,  కొత్త రూపమైన వారణాసిని పరిరక్షించుకోవాలని కోరారు. ఈరోజు చరిత్రాత్మకమైన రోజు.  వారణాసి, దేశం మొత్తంగా ఎంతో అభివృద్ధిని చూస్తోందని, ఇటువంటి పురోగతి గత దశాబ్దాల కాలం క్రితమే జరుగాల్సి ఉందని, కాని  అది జరుగలేదని అన్నారు. గంగా నది దగ్గర బహుళ తరహా టెర్మినల్ గురించి గతంలో తాను మాట్లాడినప్పుడు దీనిని ఒక హాస్యస్పదంగా భావించారు. దీనికి వ్యతిరేకంగా మాట్లడారు.

కాని ఇప్పుడు ఈ ప్రాజెక్టులు నవీన భారతదేశ కొత్త దృష్టికి ఉదాహరణగా నిలిచాయని ఆయన తెలిపారు. గంగా నది మీద ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యం వల్ల ముందు తరాల వాళ్లు రవాణాలో వచ్చిన మార్పుని గమనిస్తారని తెలిపారు. ప్రస్తుతం దేశానికి  అభివృద్ధితో ముడిపడిన రాజకీయాలు అవసరం. అభివృద్ధి మీద ఆధారపడే ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాని ఓటు బ్యాంకు రాజకీయాలను చూసి కాదని మోడీ అన్నారు. తాము సామాన్యుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు  చేపట్టామని, వాటిలో  స్వచ్ఛత, ఆరోగ్యం వంటివి ఉన్నాయని మోడీ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై చిత్తశుద్ధితో  పనిచేశామని చెప్పారు.

2014కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం కన్నా తక్కువగా పరిశుభ్రత ఉండేదని, ప్రస్తుతం 90 శాతం పరిశుభ్రత ఉందని, ఇది తనకి గర్వకారణమని తెలిపారు. ఇక ఆయుష్మాన్ భారత్ పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించినదని, ప్రారంభించిన 40 రోజుల్లోనే 2 లక్షల మంది దీనివల్ల లబ్ది పొందారని చెప్పారు. నమామి గంగా ఒక కొత్త దశ అని, ఈ కార్యక్రమంలో వృధాగా డబ్బులు గంగలో పారవేయరని, వాటిని గంగని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారని మోడీ తెలిపారు బిజెపి ప్రభుత్వం భారతదేశం అభివృద్ధి కోసం నిలిచిన పార్టీ, ఈ దేశ ప్రజలు తమకు ముఖ్యమని అన్నారు.

భారత్ తొలి బహుళ తరహా టెర్మినల్‌ని గంగా నదిపై  ప్రారంభించిన మోడీ,  దేశంలోని నదులపై  తొలిసారి ప్రవేశపెట్టిన కోల్‌కతా నుంచి వచ్చిన కార్గో రవాణ కంటెయినర్‌కి స్వాగతం పలికారు. అంతేకాకుండా 34 కిలో మీటర్ల కొత్త రోడ్డు మార్గాలతోపాటు రెండు మురికి నీటి పారుదల నిర్మాణాలను ప్రారంభించారు. మోడీతోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

PM Modi inaugurates projects worth Rs 2413 cr in Varanasi

Telangana News