‘రాఫెల్’పై ఏళ్ల తరబడి చర్చలు

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత్ ఏర్పాటు చేసిన బృందం వాటి ధరలు, నిర్వహణపై విస్తృతంగా చర్చలు జరిపిందని, గతంలో ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ కంపెనే ఇవ్వజూపిన వాటికంటే ఇవి చాలా మెరుగైనవని కేంద్రం సుప్రీంకోర్టుకు గత నెలలో తెలిపింది. ఈ ఒప్పందంపై లోతుగా పరిశీలించిన కేంద్రం ఒక రిపోర్టుని సుప్రీం పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేయాలని కోరిన పిటిషనర్లకు అందజేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై నిర్ణయం తీసుకోవడానికి అనుసరించిన విధానాలపై పూర్తి వివరాలు […]

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత్ ఏర్పాటు చేసిన బృందం వాటి ధరలు, నిర్వహణపై విస్తృతంగా చర్చలు జరిపిందని, గతంలో ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ కంపెనే ఇవ్వజూపిన వాటికంటే ఇవి చాలా మెరుగైనవని కేంద్రం సుప్రీంకోర్టుకు గత నెలలో తెలిపింది. ఈ ఒప్పందంపై లోతుగా పరిశీలించిన కేంద్రం ఒక రిపోర్టుని సుప్రీం పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేయాలని కోరిన పిటిషనర్లకు అందజేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై నిర్ణయం తీసుకోవడానికి అనుసరించిన విధానాలపై పూర్తి వివరాలు అందజేసింది.డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ర్యాంకు అధికారి నేతృత్వంలో కేంద్రం నియ మించిన బృందం సంవత్సరంపాటు చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.

దీంతో  2016 జూన్‌లో రాఫెల్ కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గ పరిశీలక కమిటీ, రక్షణ సముపార్జన మండలి (డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్) ఆమోదం తెలిపాయని 16 పేజీల డాక్యుమెంట్‌లో ప్రభు త్వం చెప్పింది. దేశ భద్రతపై ప్రభావం చూపే అంశాల జోలికి పోకుండా మిగతా విషయాలతో తయారు చేసిన డాక్యుమెంట్‌ని పిటిషనర్లకు ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్డు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో సోమవారంనాడు కేంద్రం ఈ నివేదికని పిటిషనర్లకు అందజేసింది. రాఫెల్ కొనుగోలు కేసుని వారం తరువాత విచారిస్తామని సుప్రీం తెలిపిది.

రాఫెల్ విమానాల ధరల వివరాలను కోర్టుకు సమర్పించాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. 36 రాఫెల్ యుద్ధ విమా నాల కొనుగోలుపై ఎన్‌డిఎ అధికారంలో ఉన్న భారత్, ఫ్రాన్స్ దేశాలు అవగాహనకు వచ్చాయని  2015 ఏప్రిల్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒప్పందంపై కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసింది. యుద్ధ విమానాలను తయారు చేయడంలో మంచి ప్రావీణ్యం కలిగిన భారత ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌ని దసాల్డ్‌కి భారత్‌లో భాగస్వామిగా చేయకుండా ప్రైవేల్ వ్యక్తులకు చెందిన కంపెనీని భాగస్వామిగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో 3000 కోట్లు ఆ కంపెనీ ఖాతాకు పోయాయని ఆరోపించింది.

Rafale deal is the largest defence scam in India

Telangana News

Related Stories: