ఫైజాబాద్‌లో మద్యం, మాంసంపై నిషేధం

లక్నో : ఫైజాబాద్ పేరుని అయోధ్యగా మార్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఈ అయోధ్య జిల్లా అంతటా మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధించాలనే ప్రతిపాదనకి అంగీకారం తెలిపడానికి సిద్ధమయ్యారు. మద్యం, మాంసం అమ్మకాలను అయోధ్యలో నిషేధించాలని స్థానిక సాధువులు డిమాండ్ చేశారు. అయోధ్య జిల్లాలో మద్యం, మాంసంపై నిషే ధం విధించాలనే సాధువులు చేసిన డిమాండ్‌ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్‌శర్మ చెప్పారు. చట్టపరిధిలోనే ప్రభు త్వం మద్యం, మాంసంపై నిషేధం […]

లక్నో : ఫైజాబాద్ పేరుని అయోధ్యగా మార్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఈ అయోధ్య జిల్లా అంతటా మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధించాలనే ప్రతిపాదనకి అంగీకారం తెలిపడానికి సిద్ధమయ్యారు. మద్యం, మాంసం అమ్మకాలను అయోధ్యలో నిషేధించాలని స్థానిక సాధువులు డిమాండ్ చేశారు. అయోధ్య జిల్లాలో మద్యం, మాంసంపై నిషే ధం విధించాలనే సాధువులు చేసిన డిమాండ్‌ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్‌శర్మ చెప్పారు. చట్టపరిధిలోనే ప్రభు త్వం మద్యం, మాంసంపై నిషేధం విధించనుందని తెలిపారు. అయోధ్య అనేది ఒక పుణ్యక్షేత్రం, ఈ నగరంలో మద్యం, మాంసం అమ్మకూడదని ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. నిషేధం విధించడం వల్ల ఆరోగ్యవంతమైన జీవినశైలి అలవడుతుందని తెలిపారు. అయోధ్య అనేది పవిత్ర క్షేత్రం, ఇక్కడ శతాబ్దాలుగా మాంసం, మద్యం అమ్మకాలు జరుగలేదు. ప్రస్తు తం ఫైజాబాద్ పేరుని అయోధ్యగా మార్చారని, ఇంతకాలం అయోధ్యలో అమలులో ఉన్న నిషేధం ఈ జిల్లా అంతటా కూడా అమలు చేయాలని చెప్పారు.

UP Govt May Ban Liquor and Meat In Ayodhya

Telangana News

Related Stories: