ఒడిశాలో మరో రూ.3000 కోట్ల పెట్టుబడులు

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒడిషాలో మరో రూ.3000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. రాష్ట్రంలో ఏకైక పెద్ద ఇన్వెస్టర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచిందని, ఇప్పటికే తమ సంస్థ రూ.6000 కోట్లను ఇన్వెస్ట్ చేసిందని ఆయన తెలిపారు. ‘మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్ 2018’లో పాల్గొన్న అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ మౌలిక సదుపాయాల సృష్టే ప్రధాన లక్షంగా తాము ఎక్కువ గా పెట్టుబడులు పెడుతున్నామని […]

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒడిషాలో మరో రూ.3000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. రాష్ట్రంలో ఏకైక పెద్ద ఇన్వెస్టర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచిందని, ఇప్పటికే తమ సంస్థ రూ.6000 కోట్లను ఇన్వెస్ట్ చేసిందని ఆయన తెలిపారు. ‘మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్ 2018’లో పాల్గొన్న అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ మౌలిక సదుపాయాల సృష్టే ప్రధాన లక్షంగా తాము ఎక్కువ గా పెట్టుబడులు పెడుతున్నామని ముఖేష్ అన్నారు. రిలయన్స్ జియో ఒక వ్యాపారమే కాదని, భారత్‌లోనూ, అలాగే ఒడిషాలో మార్పులు తెచ్చేందుకు ఇదొక ఉద్యమమని అన్నారు. గత రెండేళ్లలో ఒడిషాలో తాము అనేక కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించాలని, రూ.30 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించామని ఆయన అన్నారు. ఒడిశాలో ప్రారంభించిన ఈ సదస్సును ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, టాటా సన్స్ చైర్‌పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ తదితరులు హాజరయ్యారు.

RIL to invest Rs 3,000 crore in Odisha in next 3 years

Telangana Latest News

Related Stories: