బిజెపిపై రజనీ ఘాటు వ్యాఖ్యలు…

చెన్నై: తమళ సూపర్ స్టార్ రజనీకాంత్ మోడీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు భావిస్తున్నట్టుగా బిజెపి ప్రమాదకరమైన పార్టీ అనేది నిజమేనేమో అని ఆయన అన్నారు. సోమవారం చెన్నై విమానాశ్రయంలో రజినీకాంత్ మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు సరిగ్గా అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇది సుదీర్ఘంగా చర్చించాల్సిన అంశమన్నారు. ఈ విషయంపై ఒక్క మాటలో సమాధానం చెప్పటం కష్టమని ఆయన చెప్పారు. బిజెపి ప్రమాదకరమైన పార్టీ అనుకుంటున్నాయి కాబట్టే […]

చెన్నై: తమళ సూపర్ స్టార్ రజనీకాంత్ మోడీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు భావిస్తున్నట్టుగా బిజెపి ప్రమాదకరమైన పార్టీ అనేది నిజమేనేమో అని ఆయన అన్నారు. సోమవారం చెన్నై విమానాశ్రయంలో రజినీకాంత్ మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు సరిగ్గా అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇది సుదీర్ఘంగా చర్చించాల్సిన అంశమన్నారు. ఈ విషయంపై ఒక్క మాటలో సమాధానం చెప్పటం కష్టమని ఆయన చెప్పారు. బిజెపి ప్రమాదకరమైన పార్టీ అనుకుంటున్నాయి కాబట్టే బిజెపేతర పార్టీలన్నీ కూటమి దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయేమోనన్నారు. ఇంకా మాట్లాడుతూ… బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రధాని మోడీ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రజనీ… బిజెపి గురించి ఈ విధంగా  మాట్లాడారు. దీంతో ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఈ అంశం హట్ టాపిక్ గా మారింది. రెండు సంవత్సరాల క్రితం మోడీ పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి రజనీకాంత్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Rajinikanth Sensational Comments on BJP

telangana latest news

Related Stories: