‘ఇన్‌ల్యాండ్‌ పోర్ట్‌’ను ప్రారంభించిన మోడీ

వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సోమవారం ఇన్‌ల్యాండ్‌ పోర్ట్‌ను ప్రారంభించారు.  అంతర్గత జల రవాణాను అభివృద్ధి చేసేందుకు వారణాసిలో గంగా నదిపై ఈ పోర్టును నిర్మించారు. ఈ పోర్టు ద్వారా వారణాసి నుంచి పశ్చిమ్‌బంగాలోని హల్దియా నగరానికి భారీ కంటెయినర్లను రవాణా చేయొచ్చు. దేశంలో తొలిసారిగా అంతర్గత జల రవాణా ద్వారా పశ్చిమ్‌బంగా నుంచి అక్టోబరు 30న బయల్దేరిన కంటెయినర్ ఈ రోజు వారణాసి పోర్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆ […]

వారణాసి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సోమవారం ఇన్‌ల్యాండ్‌ పోర్ట్‌ను ప్రారంభించారు.  అంతర్గత జల రవాణాను అభివృద్ధి చేసేందుకు వారణాసిలో గంగా నదిపై ఈ పోర్టును నిర్మించారు. ఈ పోర్టు ద్వారా వారణాసి నుంచి పశ్చిమ్‌బంగాలోని హల్దియా నగరానికి భారీ కంటెయినర్లను రవాణా చేయొచ్చు.

దేశంలో తొలిసారిగా అంతర్గత జల రవాణా ద్వారా పశ్చిమ్‌బంగా నుంచి అక్టోబరు 30న బయల్దేరిన కంటెయినర్ ఈ రోజు వారణాసి పోర్టుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆ కంటెయినర్‌ను రిసీవ్‌ చేసుకున్నారు. జల్‌ మార్గ్‌ వికాస్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ పోర్టును నిర్మించారు. తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా నదీ రవాణా చేయొచ్చనే ఉద్దేశంతో అంతర్గత జల రవాణా ప్రోత్సహిం చేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. ది ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యుఎఐ) ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది.

Modi launched ‘Inland Port’ in varanasi