‘కవచం’టీజర్ విడుదల

అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం వంటి చిత్రాలతో అలరించిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘కవచం’ సినిమా చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, మెహరీన్‌ నటిస్తున్నారు.ఈ చిత్రంలో తొలిసారిగా బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ శొంఠినేని నిర్మిస్తున్న ఈ సినిమాకు నూతన డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రం టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘అనగనగా ఓ […]

అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం వంటి చిత్రాలతో అలరించిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘కవచం’ సినిమా చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, మెహరీన్‌ నటిస్తున్నారు.ఈ చిత్రంలో తొలిసారిగా బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ శొంఠినేని నిర్మిస్తున్న ఈ సినిమాకు నూతన డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ చిత్రం టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
‘అనగనగా ఓ రాజ్యం.. ఆ రాజ్యానికి రాజు లేడు. రాణి మాత్రమే.. ఆ రాణికి కవచంలా ఓ సైనికుడు’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘భయపెట్టేవాడికీ.. భయపడేవాడికీ మధ్య ఒకడు ఉంటాడు రా.. వాడే పోలీస్‌’, పోలీసోడితో ఆడాలంటే బులెట్‌ కంటే బ్రెయిన్‌ ఫాస్ట్‌గా ఉండాలి’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘ఎక్కడో లింక్‌ మిస్‌ అవుతోంది. మనకు తెలియని కథ.. ఇంకేదో జరుగుతోంది’ వంటి డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు ఛాయా గ్రహణం అందిస్తుండగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. మరి తాజాగా విడుదలైన ‘కవచం’ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

Kavacham movie teaser released

Related Stories: