సినిమాలంటే ఇష్టం

  ఓ హెయిర్‌కట్ అమ్మాయి మన ఇంట్లో టీవి ప్రసారమాధ్యమాల్లో, సినిమా హాల్లో తన మాటలతో, తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ ఫోన్ కన్నా మీ నెట్‌వర్క్ స్పీడుగా ఉంటే, జీవితాంతం మీ ఫోన్ బిల్లు మేమే కడతాం అంటూ తెగ ఊరించేస్తుంది కదా! ఆ అమ్మాయి మాట వినపడగానే మన పక్కింటి అమ్మాయే అనుకునేలా అందరి దృష్టి ఆమె మీదకే వెళ్లిపోతూ ఉంటుంది. ఇంతలా అందర్నీ ఆకట్టుకుంటున్న అమ్మాయి ఎవరో కాదు శాషా చెత్రి. ఎయిర్‌టెల్ […]

 

ఓ హెయిర్‌కట్ అమ్మాయి మన ఇంట్లో టీవి ప్రసారమాధ్యమాల్లో, సినిమా హాల్లో తన మాటలతో, తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ ఫోన్ కన్నా మీ నెట్‌వర్క్ స్పీడుగా ఉంటే, జీవితాంతం మీ ఫోన్ బిల్లు మేమే కడతాం అంటూ తెగ ఊరించేస్తుంది కదా! ఆ అమ్మాయి మాట వినపడగానే మన పక్కింటి అమ్మాయే అనుకునేలా అందరి దృష్టి ఆమె మీదకే వెళ్లిపోతూ ఉంటుంది. ఇంతలా అందర్నీ ఆకట్టుకుంటున్న అమ్మాయి ఎవరో కాదు శాషా చెత్రి. ఎయిర్‌టెల్ 4జి యాడ్‌తో కొన్ని కోట్ల మందికి చేరువైంది. భారతీయ బుల్లి తెరపై తక్కువ సమయంలో ఎక్కువ సార్లు కనిపించిన ఘనత ఈమె సొంతం. నిన్న మొన్నటి వరకూ  బుల్లితెరకే పరిమితమైన ఈ హెయిర్‌కట్ అమ్మాయి త్వరలో వెండితెరమీద మెరవనుంది.

పేరు : శాషా చెత్రి,
నిక్‌నేమ్ : రిక్షారాణి, ఎయిర్‌టెల్ గర్ల్,
ప్రత్యేకతలు : మోడల్, యాక్టర్, మ్యూజిషియన్ ‘బేషరమ్’ అనే ఆల్బమ్ తో మంచి పేరు వచ్చింది. వయస్సు : 21,
అలవాట్లు : పాటలు పాడటం.
పుట్టిన తేది : 20 నవంబర్ 1996,
పుట్టిన ప్రాంతం : డెహ్రాడూన్, ఉత్తరాఖండ్; ఇండియా,
తెరంగేట్రం : ఎయిర్ 4జి ప్రకటన, యాడ్ ఏజన్సీలో కాపీ రైటర్‌గా..
చదువు : కమ్యూనికేషన్ అడ్వర్‌టైజింగ్‌లో డిగ్రీ ముంబయిలో,
కోరికలు : చిన్నప్పటి నుండి మోడల్ కావాలనే కోరిక తీరింది.

Airtel Ad Girl Biography in Telugu

Telangana news