కెసిఆర్ స్వప్నం తెలంగాణ పునర్నిర్మాణం

కేసీఆర్‌పై రాజకీయ విమర్శలు చేసేవాళ్లు సైతం ఈ నాలుగున్నరేళ్లలో ఆయన పునర్నిర్మాణ పనులను అంగీకరించారు. ప్రతిపక్షాలే కాదు, దేశమే ఒప్పుకుంది. కాకపోతే ఇపుడు ఎన్నికలు కాబట్టి ఎవరెవరు ఏదైనా కూయవచ్చును. ఏ విధంగానైనా నిరాధార మాటలు మాట్లాడవచ్చును. కేసీఆర్ దార్శనికుడు. ఆయన ఆనాడు రాష్ట్రసాధన ఉద్యమానికి ఎంత అవసరమో నేటి పునర్నిర్మాణానికి కూడా అంతే అవసరం. ఇదే నిర్ణయాన్ని రెండవసారి జరగబోతున్న ఎన్నికలలో కూడా తెలంగాణ సమాజం తీర్పివ్వనుంది. అందుకే ఈ ఎన్నికలు కూడా ఒకరకంగా ఉద్యమ […]

కేసీఆర్‌పై రాజకీయ విమర్శలు చేసేవాళ్లు సైతం ఈ నాలుగున్నరేళ్లలో ఆయన పునర్నిర్మాణ పనులను అంగీకరించారు. ప్రతిపక్షాలే కాదు, దేశమే ఒప్పుకుంది. కాకపోతే ఇపుడు ఎన్నికలు కాబట్టి ఎవరెవరు ఏదైనా కూయవచ్చును. ఏ విధంగానైనా నిరాధార మాటలు మాట్లాడవచ్చును. కేసీఆర్ దార్శనికుడు. ఆయన ఆనాడు రాష్ట్రసాధన ఉద్యమానికి ఎంత అవసరమో నేటి పునర్నిర్మాణానికి కూడా అంతే అవసరం. ఇదే నిర్ణయాన్ని రెండవసారి జరగబోతున్న ఎన్నికలలో కూడా తెలంగాణ సమాజం తీర్పివ్వనుంది. అందుకే ఈ ఎన్నికలు కూడా ఒకరకంగా ఉద్యమ సంరంభాన్ని గుర్తు చేస్తున్నాయి. ఉద్యమంలో ఆనాడు రాష్ట్రసాకారం తర్వాత పాలకునిగా ఇప్పుడు కేసీఆర్ తెలంగాణను తట్టిలేపే ఒక స్వరం. కేసీఆర్ తెలంగాణ సహతత్వం అందుకే ఆయన మాట చెబితే నిలబడింది తెలంగాణ. 

ఒక నిర్మాణం జరుగుతున్న సమయంలో దాన్ని ఆపి వదిలేసి వేరేవాళ్లకు హస్తగతం చేస్తే దాని రూపురేఖలు మారిపోవచ్చును. అందుకే కేసీఆర్ అవసరంగా ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరముంది. దీన్ని సంక్షేమపధకాల లబ్ధిపొందే పేదలు గుర్తుపెట్టుకుంటారు. చేసిన సహాయాన్ని మర్చిపోయే తత్త్వం తెలంగాణ సమాజానికి లేదు. ఈ ఎన్నికల్లో  కేసీఆర్‌కే  ఓటు వేయ్యాలని నాలుగున్నరేళ్ల పునర్నిర్మాణ పనులే చెప్తున్నాయి… కేసీఆర్ కొన్ని విషయాల్లో నిర్దాక్షిణ్యంగా ఉన్నారు. స్వంతలాభం కోసం అర్రులు చాపే వర్గాలను అదుపులో పెట్టారు… ఏఏ స్వార్థపర శక్తులు ఎటు నుంచి వస్తారో కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆయన ఈ విషయాల్లో నిక్కచ్చిగా ఉన్నారు. లేకపోతే టీఆర్‌ఎస్‌ను కూడా పాత రాజకీయ ఉచ్చుల్లోకి తీసుకపోవాలని ఎదురు చూసే వారున్నారు. 

‘ఎన్నో ప్రాణాల బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఒక సంయమనంతో, హృదయ పూర్వక విధానంతో అందరం కలిసి మన తెలంగాణను నిర్మించుకోవాలి. ఏ ఒక్క చిన్న తప్పుచేసినా అది ముందు తరాల వారికి దెబ్బకొడుతుంది. ఆ దెబ్బ తగలవద్దు” కేసీఆర్ (శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం, 2014)

రాష్ట్రం అవతరించాక నాలుగు సంవత్సరాల మూడు నెలల కేసీఆర్ పాలనలో 60 ఏళ్లల్లో జరగని పనులు జరిగాయి. ఒక రకంగా తెలంగాణ విధ్వంసం నుంచి పునర్నిర్మించబడుతున్న దశ ఇది. అన్ని రంగాలు నిస్తేజంగా పడివున్న దశ నుంచి వాటికి కొత్త రూపురేఖలు తీసుకరావటం కోసం కృషి చేస్తున్న తరుణమిది. ఇంటింటికి మంచినీళ్లు అందించే పని ఈ నాలుగేళ్లలో పూర్తవుతుందంటే గత పాలకుల నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందో అర్థమౌతుంది. కరువుతో కమ్మేసిన మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడిప్పుడే వలసల నుంచి విముక్తి అవుతూ ఉంది.

ఫ్లోరోసిస్ విషపు నీళ్లతో వంకర్లు, కొంకర్లు తిరిగిన నల్లగొండ జిల్లాకు మంచినీళ్లు అందించే పనిని రాష్ట్రం వచ్చాక కేసీఆర్ చేపట్టారు. కాళేశ్వరం లాంటి మహత్తర ప్రాజెక్టుల పని ముమ్మరంగా జరుగుతుంది. సంచార జాతుల పిల్లలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు గురుకులాల ద్వారా కార్పొరేట్ స్థాయిలో విద్య అందించబడుతుంది. తెలంగాణ కన్న కలలు ఇప్పుడిప్పుడే నెరవేర్చ బడుతున్నాయి.

తెలంగాణ సమాజమంతా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉద్యమ సమయంలో సబ్బండ వర్ణాలు కలిసికట్టుగా జై తెలంగాణ అని నినదించినట్లుగా ఈ ఎన్నికల్లో కూడా కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కలిసి పోరాడింది తెలంగాణ కోసం. మనందరం ఎన్నో కష్టాలుపడి కలిసి తెచ్చుకుంది తెలంగాణ. రాష్ట్రం సాకారం చేసుకున్నాక మళ్లీ ముక్తకంఠంతో తొలి ఎన్నికల్లో ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే తెలంగాణ జై కొట్టింది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఈ నాలుగున్నరేళ్లుగా తెలంగాణలో పునర్నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

కేసీఆర్ ఆలోచనలతో, దార్శనికతతో ప్రధానంగా సాగు, తాగునీటి రంగాలకు సంబంధించిన మహత్తరమైన పనులు దేశంలో మరే రాష్ట్రంలోలేని విధంగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. తెలంగాణ తనకు తాను అలసట నుంచి సేద తీర్చుకుంటూ పునర్నిర్మాణానికి పునరంకితమై ముందుకు సాగుతుంది. ఇన్నాళ్లు జరగనిది, ఇప్పటి దాకా ఎవ్వరూ చేయలేని నిర్మాణాత్మకమైన పనులు జరుగుతున్నాయి. తెలంగాణ స్వయం నిర్ణయాధికారం పొందిన తర్వాత జరుగుతున్న పునర్నిర్మాణ పనులు అత్యంత కీలకమైనవి. ఉద్యమ స్ఫూర్తికి కొనసాగింపుగానే తెలంగాణ రాష్ట్రం కొత్తగా అన్ని రంగాలను పునర్నిర్మించుకుంటున్న శక్తినంతా కూడదీసుకుని, ఉన్న వనరులన్నింటిని ఉపయోగించుకొని తెలంగాణ సమాజ నిర్మాణం జరుగుతుంది. దీనికి కేసీఆర్ దార్శనికతతో పాటుగా ఆయనలో ఉన్న మొండితనం, వెనక్కు తగ్గని స్వభావం కూడా ఇందుకు దోహదం చేస్తూ వచ్చింది.

కేసీఆర్‌పై రాజకీయ విమర్శలు చేసేవాల్లు సైతం ఈ నాలుగున్నరేళ్లలో ఆయన పునర్నిర్మాణపనులను అంగీకరించారు. ప్రతిపక్షాలే కాదు, దేశమే ఒప్పుకుంది. కాకపోతే ఇపుడు ఎన్నికలు కాబట్టి ఎవరెవరు ఏదైనా కూయవచ్చును. ఏ విధంగానైనా నిరాధారణ మాటలు మాట్లాడవచ్చును. కేసీఆర్ దార్శనికుడు. ఆయన ఆనాడు రాష్ట్ర సాధన ఉద్యమానికి ఎంత అవసరమో నేటి పునర్నిర్మాణానికి కూడా అంతే అవసరం. ఇదే నిర్ణయాన్ని రెండవసారి జరగబోతున్న ఎన్నికలలో కూడా తెలంగాణ సమాజం తీర్పివ్వనుంది. అందుకే ఈ ఎన్నికలు కూడా ఒకరకంగా ఉద్యమ సంరంభాన్ని గుర్తు చేస్తున్నాయి. ఉద్యమంలో ఆనాడు రాష్ట్రసాకారం తర్వాత పాలకునిగా ఇప్పుడు కేసీఆర్ తెలంగాణను తట్టిలేపే ఒక స్వరం. కేసీఆర్ తెలంగాణ సహతత్వం అందుకే ఆయన మాట చెబితే నిలబడింది తెలంగాణ. ఆయన ఆమరణ నిరాహరణ దీక్షకు కదలిపోయి కదం తొక్కింది తెలంగాణ. అందుకే 50 కేజీల బక్కమనిషికి అంతబలం. తెలంగాణ సమాజాన్ని కదిలించగలిగిన శక్తి, ఉద్యమాన్ని నడిపించే మహాశక్తిగా మారారు. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన పునర్నిర్మాణ విప్లవంగా రాష్ట్ర పునర్నిర్మాణాన్ని మార్చి రాష్ట్రాన్ని ప్రగతి పధంలో ముందుకు తీసుకపోతున్నారు. ఈ అభివృద్ధి రధం ఆగకూడదు. ఈ పునర్నిర్మాణ ప్రక్రియకు బ్రేకులు పడకూడదు. కొనసాగింపు జరిగితీరాలి.

సరిగ్గా రాష్ట్రసాధన ఉద్యమ సమయంలో ఈ ఉద్యమానికి దూరంగా వున్న శక్తులు, ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని కూటములు, అడుగడుగునా ఉద్యమానికి అడ్డుతగిలిన వ్యక్తులు, శక్తులే ఈ ఎన్నికల్లో మహాకూటమిగా కలిసికట్టుగా రావటం కేసీఆర్‌కు రాష్ట్రసాధన తర్వాత జరుగుతున్న మరో పరీక్ష. కేసీఆర్‌కు సవాళ్లను సవాల్‌చేసి ఎదుర్కొనటం అలవాటైన విద్య. రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజకీయ ప్రక్రియలో ఉద్యమజెండాను పట్టుకొని ఒక్కడుగా తెగించి కొట్లాడాడు. ఉద్యమ కసితో ఉద్యమించాడు. సరిగ్గా రాష్ట్ర అవతరణ తర్వాత జరుగుతున్న రెండవ ఎన్నికల్లో కూడా ఉద్యమ సమయంలో కలిసి రాష్ట్రశక్తులన్నీ కట్టకట్టుకుని మీదకు దూసుకొస్తున్నా కేసీఆర్ ఒక్కడుగానే ధైర్యంగా, ధీశాలిగా ఈ బరిలో నిలిచి దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు కూడా ఆనాటి ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట కోసం ఎదురుచూసినట్లుగానే ఎన్నికల శంఖారావం పూరించాక కేసీఆర్ మాట కోసం తెలంగాణ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది.

ఈ ఒక్కటి చాలు కేసీఆర్ అంటే తెలంగాణకు తిరుగులేని నమ్మకం, ఆయన పట్టుతప్పని పట్టుదలపై అచంచల విశ్వాసం ఉన్నాయి. కేసీఆర్ తెలంగాణ మట్టి గుండె స్పర్శ తెలుసు. పదవులు రానివాళ్లు, పదవుల్లో లేని వాళ్లు, తమ తరతరాల రాజకీయ వారసత్వం పోతుందని తహతహలాడుతున్న ఆధిపత్యశక్తులు, ఇపుడు అధికారం రాకపోతే పాత ఆధిపత్యశక్తులు ఇకలేవటం కష్టమని ఎన్ని కుయుక్తుల శక్తులు కూడగట్టుకున్నా పునర్నిర్మాణ శక్తిగా నిలిచిన కేసీఆర్‌ను ఎదుర్కోవటం కష్టం. తెలంగాణకు కేసీఆర్ కాకుండా ఎవరికి ఈ అధికార పగ్గాలిచ్చినా రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుంది. ప్రజల నోటి దగ్గరకు వచ్చిన సంక్షేమ పథకాలు ఆగిపోయే ప్రమాదముంది. ఒక నిర్మాణం జరుగుతున్న సమయంలో దాన్ని ఆపి వదిలేసి వేరేవాళ్లకు హస్తగతం చేస్తే దాని రూపురేఖలు మారిపోవచ్చును. అందుకే కేసీఆర్ అవసరంగా ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరముంది. దీన్ని సంక్షేమ పధకాల లబ్ధిపొందే పేదలు గుర్తుపెట్టుకుంటారు. చేసిన సహాయాన్ని మర్చిపోయే తత్త్వం తెలంగాణ సమాజానికి లేదు. ఈ ఎన్నికల్లో కేసీఆర్కే ఓటు వేయ్యాలని నాలుగున్నరేళ్ల పునర్నిర్మాణ పనులే చెప్తున్నాయి.

కేసీఆర్ పాలనను ప్రజలు బాగానే అర్థం చేసుకున్నారు. కేసీఆర్ కొన్ని విషయాల్లో నిర్దాక్షిణ్యంగా ఉన్నారు. స్వంతలాభం కోసం అర్రులు చాపే వర్గాలను అదుపులో పెట్టారు. రాష్ట్రంలో స్వార్థ పరశక్తులకు చెక్‌పెట్టకపోతే ఎవరికి వారు చిన్న సామంత రాజ్యాల్ని ఏర్పరుచుకుని ఆధిపత్యాలు చెలాయించే స్థితి ఉంటుంది. ఏఏ స్వార్థపర శక్తులు ఎటు నుంచి వస్తారో కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆయన ఈ విషయాల్లో నిక్కచ్చిగా ఉన్నారు. లేకపోతే టీఆర్‌ఎస్‌ను కూడా పాత రాజకీయ ఉచ్చుల్లోకి తీసుకపోవాలని ఎదురుచూసేవారున్నారు. టీఆర్‌ఎస్‌కు సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది నూతన వర్గాల నుంచి వచ్చినవారు ఉన్నారు. ఉద్యమం నుంచి నేరుగా వచ్చినవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అవినీతి లేదు. కేసీఆర్ సంక్షేమ పథకాలతో సాయం పొందిన వాళ్లంతా సాలీడ్‌గా ఉన్నారు.

ధనానికి భయంకరమైన శక్తి ఉంది. దాన్ని తట్టుకోవడం ఎవరివల్లా కాదు. కేసీఆర్ ఈ విషయంలో నిర్దాక్షిణ్యంగా లేకపోతే ఎవరికి వాళ్లుగా సంపాదనలో మినీ సామ్రాజ్యాలు ఏర్పరచుకుంటారు. డబ్బు చుట్టూ చేరే శక్తులకు కేసీఆర్ బ్రేక్ వేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్ధిపొందిన లక్షల కుటుంబాల సమ్మతి కేసీఆర్‌కుంది. అదే కేసీఆర్‌కున్న బలం. మీ ఇష్టం వచ్చినట్లు దున్నుకోండని రాష్ట్రాన్ని ఎవరికీ అప్పగించ లేదు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రేమికులు, ఆలోచనాపరులంతా ఆలోచిస్తారు. నాలుగున్నరేళ్ల పునర్నిర్మాణ ప్రక్రియను అర్థం చేసుకుని తీర్పునిస్తారు. ఇపుడు పునర్నిర్మాణాన్ని తట్టుకోలేని శక్తులే ఆనాడు రాష్ట్ర నిర్మాణంలో కూడా అడ్డుపడ్డారు. వాళ్లే ఇపుడు తమ నిరాశనంతా కూడగట్టుకుని కూటమిగా వస్తున్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఏ పని కూడా ఆగకుండా చూడాలి. అందుకు కొనసాగింపుగా కేసీఆర్‌నే పునర్నిర్మాణ కర్తగా కొనసాగవలసిన అవసరం ఉంది. కేసీఆర్ దార్శనికతతో చేసే పనులు ముందుకు సాగాలి. కాళేశ్వరం పనులు పూర్తికాబోతున్నాయి. ఆ నీళ్లు కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లు చివరనవున్న నడిగూడెం పాదాలను తాకాలి. అది కదా పరవశం. పదవుల కోసం, పవర్ కోసం ఎవరెన్ని ఎత్తులు వేసిన కేసీఆర్ కొనసాగిస్తున్న పునర్నిర్మాణ ప్రక్రియను నిర్విఘ్నంగా కొనసాగించటమే తెలంగాణ సమాజం ముందుంది. ఇప్పటికిప్పుడు నిజమిదే. నినాదమిదే. కేసీఆర్ స్వప్నం తెలంగాణ పునర్నిర్మాణం. “ఆకుపచ్చ హరిత తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్ళు తేవటానికి ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎవరు ఎన్ని అవరోధాలు కల్పించినా ఆ నీళ్లు సాధించి తెస్తాం. ఆ నీళ్లతో తెలంగాణ రైతన్నల పొలాలు తడుపుతాం, రైతన్నల కన్నీరు తుడుస్తాం” కేసీఆర్ (తెలంగాణ శాసనసభ 10.11.2014)

KCR dream of Telangana reconstruction

Telangana Latest News