విజయం టిఆర్‌ఎస్‌దే : గంగుల

కరీంనగర్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కరీంనగర్ టిఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ మైదానంలో వాకర్లను కలిసి తనకు మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు. తప్పుడు హామీలతో ఓట్ల కోసం వస్తున్న మహాకూటమి నేతలకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహాకూటమి నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా, కరీంనగర్‌లో […]

కరీంనగర్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కరీంనగర్ టిఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ మైదానంలో వాకర్లను కలిసి తనకు మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు. తప్పుడు హామీలతో ఓట్ల కోసం వస్తున్న మహాకూటమి నేతలకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహాకూటమి నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా, కరీంనగర్‌లో తనదే విజయమని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ తన నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని ఆయన తెలిపారు.

Gangula Kamalaker Election Campaign in Karimnagar

Related Stories: