ఉమ్మడి జిల్లాలో ద్విముఖ పోటీ

అభ్యర్థుల వేటలో మహాకూటమి, మారనున్న రాజకీయ పరిమాణాలు, గెలుపే అభ్యర్థుల లక్షం, సిఎం కెసిఆర్ ఆదేశాలే.. ప్రచారాస్త్రాలు, సునాయాసం కానున్న టిఆర్‌ఎస్ గెలుపు, ప్రచారశైలి మార్చిన  అభ్యర్థులు కరీంనగర్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 నియోజకవర్గాలకు సిఎం కెసిఆర్, టిఆర్‌ఎస్ అధినేత తమ అభ్యర్థులను ప్రకటించగా పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీకి దీటుగా మహాకూటమి చెందిన అభ్యర్థులతో పాటు బిజెపి, కాంగ్రెస్ అశావాహులు కూడ ప్రచారాన్ని కొనసాగిస్తున్నా […]

అభ్యర్థుల వేటలో మహాకూటమి, మారనున్న రాజకీయ పరిమాణాలు, గెలుపే అభ్యర్థుల లక్షం, సిఎం కెసిఆర్ ఆదేశాలే.. ప్రచారాస్త్రాలు, సునాయాసం కానున్న టిఆర్‌ఎస్ గెలుపు, ప్రచారశైలి మార్చిన  అభ్యర్థులు

కరీంనగర్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 నియోజకవర్గాలకు సిఎం కెసిఆర్, టిఆర్‌ఎస్ అధినేత తమ అభ్యర్థులను ప్రకటించగా పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీకి దీటుగా మహాకూటమి చెందిన అభ్యర్థులతో పాటు బిజెపి, కాంగ్రెస్ అశావాహులు కూడ ప్రచారాన్ని కొనసాగిస్తున్నా రు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, కోరుట్ల నియోజకవర్గా ల్లో మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెట్లలో ద్విముఖ పోటీ నెలకొంది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం మినహా అన్ని 12 స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని జోరు గా కొనసాగిస్తున్నా రు. సిఎం కెసిఆర్ ఇటీవల హైదరాబాద్‌లో అభ్యర్థుల భేటి అనంత రం నియోజకవర్గాలోకి వచ్చిన అభ్యర్థులు ప్రచార శైలీని మార్చి ప్ర జల ముందుకు వెళ్తున్నారు. సిఎం ఆదేశాలను తూచ తప్పకుండా ప్రజల్లోకి ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాల్లోకి తీసుకెళ్తూ కారుకు ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రతి శాసనసభ్యులు నియోజకవర్గంలోని లబ్ద్ధిదారుల జాబితాను, గ్రామాల్లో చేసి న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ నూతన హంగులతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

మహాకూటమి పొత్తులు కుదురక పోవడంతో కూ టమి నుండి టికెట్ ఆశీస్తు న్న అభ్యర్థులు ప్రచారం చేసుకోలేక, ప్రజలను కలువలేక పోతున్నా రు. ఇప్పటికే టిఆర్‌ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, తెలంగాణ జన సమితి అభ్యర్థుల కంటే ప్రచారంలో ముందుండటంతో ప్రజల నోట.. కెసిఆరే మళ్ళీ సిఎం అనే మాట వినబడుతుం ది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చుట్టు కాంగ్రెస్ నేతలు టికెట్ల కోసం తిరుగుతుండగా పొత్తుల్లో ఎవరి టికెట్ గల్లంతు అవుతుందోనని జంకుతున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ప్రస్తుత టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే  గంగుల కమలాకర్ ప్రతి ఇంటిని తట్టుతూ కుటుంబసభ్యుల దీవెనలు తీసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ప్రచారంలో వెనుకబడ్డారు. మానకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలుపుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బిజెపి అభ్యర్థిని ప్రకటించడంతో ప్రజల్లోకి వెళ్లితనకు ఓటు వేయాలని కోరుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి టికెట్ ఖరారు కాకపోవడంతో ప్రచారం చేయలేక పోతున్నారు.

మంథని నియోజకవర్గంలో మాత్రం మాజీ మంత్రి శ్రీధర్ బాబుకే దాదాపు టికెట్ ఖరారు అవుతుందని ఎవరు ఆయనను వ్యతిరేకించక పోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సిఎం కెసిఆర్ ద్వారా పుట్ట మధుకర్ రాష్ట్రంలోనే అధిక నిధులు నియోజకవర్గానికి విడుదల చేయించుకొని అభివృద్ధి చేశా రు. మారుమూల ప్రాంతాన్ని గత పాలెవరు పట్టించుకోలేదని, కెసిఆర్ మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఆయనకే మళ్లీ ఓటు వేసి రుణం తీర్చుకోవాలని ప్రజలకు తెలుపుతుంటే పుట్ట మధుకు ప్రజల నీరాజనం పలుకుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆరుగురు అభ్యర్థులు టికెట్ ఆశిస్తుండగా, అధిష్టానం మా త్రం ఎవరి పేరును ఖరారు చేయలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే విజయరమణ రా వు మాత్రం తనకే టికెట్ వస్తుందంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆదే బాటలో బిజెపి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ధర్మపురిలో ప్రభుత్వ మాజీ చీప్ విప్ కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో దూసుకెళ్తుండగా మహాకూటమి అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించక పోవడంతో కాంగ్రెస్‌లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రవీందర్‌లు ఎవరికి వారే ప్రచారాన్ని నిర్వహిస్తుండగా బిజెపి అభ్యర్థి కన్నం అంజయ్య కూడ ప్రచారాన్ని తనదైనశైలీలు ముందుకు తీసుకెళ్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎలాగైన గులాబీ జెండా ఎగురవేయాలని మంత్రి కెసిఆర్, ఎంపి కవిత టార్గెట్‌గా పెట్టుకుని డాక్టర్ సంజయ్ కుమార్ గెలుపే లక్షంగా  ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. జగిత్యాల సీటు ఎవరిదో…అన్నదానిపై చర్చకొనసాగుతుంది. కోరుట్ల నియోజవర్గంలో మాజీ ఎమ్మెల్యే విద్యసాగర్ రావు సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం చేస్తున్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ నేత బొమ్మ శ్రీరాం చక్రవర్తిలు ఎవరికి వారే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి సతీష్ బాబు ప్రభుత్వం పనితీరును ప్రజలకు వివిరిస్తూ ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించక పోవడంతో టికెట్ల కోసం ఆశావాహులు వేటలో ఉన్నారు. బిజెపి అభ్యర్థి డాక్టర్ వెంకట్‌ను ప్రకటించడంతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఇప్పటికి ఒక్కసారి ప్రచారాన్ని చుట్టేయగా మరోసారి ప్రచారాన్ని సిఎం కెసిఆర్ ఆదేశాలను ప్రచారస్త్రాలుగా మలుచుకుని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంతో దూసుకెళ్తుండగా మహాకూటమి పొత్తులు తేలక పోవడంతో టికెట్ల కెటాయింపు కాకముందే కాంగ్రెస్‌లో లొల్లి కాబోతుందనే సాంకేతాలు ఆ పార్టీల్లో వినిపిస్తున్నాయి.

Related Stories: